Pages

Tuesday, May 24, 2022

బహుళైశ్చిక ప్రశ్నలు - కర్బన సమ్మేళనం

 బహుళైశ్చిక ప్రశ్నలు - కర్బన సమ్మేళనం

1. ప్రయోగశాలలో మొదట తయారుచేసిన కర్బన సమ్మేళనం?

ఎ) ఆస్పిరిన్ బి) యూరియా సి) బెంజీన్ డి) నాప్తలీన్            (బి)

2. కార్బన్ అసంఖ్యాకంగా సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణమైన ధర్మం? 

ఎ) రూపాంతరత బి) కాటనేషన్ సి) జడ ఎలక్ట్రానిక్ జంట ప్రభావం డి) ఏదీ కాదు  (బి)     

 3. కార్బన్ ఉన్నప్పటికీ కిందివాటిలో కర్బన రసాయన సమ్మేళనం కానిది?

ఎ) కార్బన్ డై ఆక్సైడ్ బి) కార్బన్ మోనాక్సైడ్ సి) కార్బొనేట్, బైకార్బొనేట్ డి) పైవన్నీ   (డి)

4. కేవలం కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్న కర్బన సమ్మేళనాలను ఏమంటారు?

ఎ) ఆల్కహాల్ బి) కార్బోహైడ్రేట్లు సి) హైడ్రోకార్బన్లు డి) ఎమైనో ఆమ్లాలు     (సి)

5. మీథేన్, ఇథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు ఏ తరగతికి చెందుతాయి? 

ఎ) ఆల్కేలు బి) ఆల్కీన్లు సి) ఆల్కైన్లు డి) ఎరోమాటిక్ సమ్మేళనాలు   (ఎ)

6. బెంజిన్, నాఫ్తలీన్ లు  ఏ తరగతికి చెందుతాయి?

ఎ) ఆల్కేన్లు బి) ఆల్కీన్లు సి) ఆల్కైన్లు డి) ఎరోమాటిక్ సమ్మేళనాలు         (డి)

 7. గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేని కుంది?

ఎ) బెంజిన్(C6H6) బి) కార్బన్ ట్రాక్లోరైడ్(CCl₄)

 సి) నాఫ్తలీన్(C10H8) డి) పారాఫిన్ నూనె(C15H11ClO7)   (సి)

 8. ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగి గొట్టం ద్వారా ఎసిటలీన్ ను పంపిస్తే వచ్చే పదార్థం? 

ఎ) బెంజిన్(C6H6)  బి)టోలీన్(C6H5CH3) సి) కార్బన్ ట్రాక్లోరైడ్(CCl₄) డి) ఇథిలీన్(C2H4)       (ఎ)

 9. కిందివాటిలో ఎక్కువ ప్రమాదరకమైనవి? 

ఎ) ఆల్కేన్లు బి) ఆల్కీన్లు సి) ఆల్కైన్లు డి) ఎరోమాటిక్ సమ్మేళనం   (డి)

10. సహజ రబ్బర్ దేని పాలీమర్? 

ఎ) క్లోరోఫ్రీన్ బి) ఐసోప్రీన్ సి) నియోప్రీన్ డి) మిథైల్ క్లోరైడ్   (బి) 

11. నూనె అంటని కృత్రిమ రబ్బరు పేరు?

 ఎ) ఐసోప్రీన్ బి) నియోప్రీన్  సి) PVC డి) నైలాన్    (బి) 

12. ప్రోటీన్లలో C,H,Oతో ఉండే మరో ముఖ్య మూలకం?

ఎ) N బి) S సి) Cl డి) ఏదీ కాదు    (ఎ)

13. ఆల్కహాల్ లో కార్బన్, హైడ్రోజన్తో పాటు ఉండే ఇతర మూలకం?

 ఎ) నైట్రోజన్ బి) సల్ఫర్ సి) ఆక్సిజన్ డి) క్లోరిన్    (సి)

14. ఆల్కహాల్ శాతం తక్కువుండే పానీయం? 

ఎ) బీరు బి) వోడ్కా సి) వైన్ డి) జిన్     (ఎ)

15. గ్యాస్ వెల్డింగ్ ల్లో ఆక్సిజన్‌తో పాటు ఉపయోగించే మరొక వాయువు ? 

ఎ) ఇథిలీన్ బి) ఎసిటలీన్ సి) మీథేన్ డి) LPG    (బి)

16. మామిడి కాయలను పక్వం చెందించడానికి కాల్షియం కార్బైడ్ ను ఉపయోగిస్తారు. అయితే దాని నుంచి విడుదలయ్యే వాయువు? 

ఎ) ఎసిటలీన్ బి) ఇథిలీన్ సి) మీథేన్ డి) పైవన్నీ    (ఎ)

 17. కిందివాటిలో కాయలను త్వరగా పక్వం చెందించడానికి పనికొచ్చే వాయువులు?

 ఎ) ఇథిలీన్ బి) ఎసిటలీన్ సి) ఎ,బి డి) ఏదీ కాదు      (సి)

 18. కిణ్వప్రక్రియ ద్వారా మొలాసిస్, బార్లీ నుంచి తయారుచేసే పదార్థం?

ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఇథైల్ ఆల్కహాల్ సి) గ్లిజరాల్ డి) గైకాల్     (బి)

19. ఎర్రచీమలు కుడితే 'చీమ! చీమ! (చిమ చిమ) అనడానికి కారణం?

ఎ) రక్తం కారడం బి) ఆల్కహాల్ శరీరంలోకి చేరడం 

సి) ఫార్మికామ్లం శరీరంలోకి ఇంజెక్ట్ కావడం డి) పెద్ద గాయం ఏర్పడడం (సి)

20. పాలు విరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనం?

ఎ) ఫార్మికామ్లం బి) లాక్టికామ్లం సి) ఎసిటికామ్లం డి) ఇథీలిన్   (బి)

21. విలీన ఎసిటికామ్లానికి మరో పేరు?

ఎ) వినిగార్ బి) ఫార్మ్ లిన్ సి) కెసిన్ డి) రెనిన్       (ఎ)

22. మెడికల్ కళాశాలల్లో మృతకళేబరాలు భద్ర పరిచే రసాయనం?

ఎ) వినిగార్ బి) ఫార్మాలిన్ సి) లాక్టికామ్లం డి) సిట్రికామ్లం       (బి)

23. ఎమైనోఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం?

ఎ) ప్రోటీన్ బి) హైడ్రోజన్ సి) పెప్టైడ్ డి) లోహబంధం    (సి)

 24. ఇథైల్ ఆల్కహాల్, బ్యుటిరికామ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్?

ఎ) ఆపిల్ బి) ఫైనాపిల్ సి) మ్యాంగో డి)జామ     (బి)

25. పాలను కల్తీ  చేసే రసాయన పదార్థం?

ఎ) లాక్టోజెన్ బి) డెక్ట్రోజ్ సి) మెలమైన్ డి) గ్లూకోజ్    (సి)

26. సువాసన ఇచ్చే పండ్ల వాసనను కలిగిన సమ్మేళనాలు?

ఎ) ఆల్కహాల్ బి) ఆమ్లాలు సి) ఎస్టర్లు డి) ప్రోటీన్   (సి)

 27. కిందివాటిలో విషపూరితమైంది?

ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఇథైల్ ఆల్కహాల్ సి) ఎసిటికామ్లం డి) గ్లిజరాల్   (ఎ)

 28. కారు రేడియేటర్లలో నీరు గడ్డ కట్టకుండా కలిపే ద్రవం?

ఎ) ఇథిలీన్ గ్లైకాల్ బి) ఇథైల్ ఆల్కహాల్ సి) మిథైల్ ఆల్కహాల్ డి) గ్లిజరాల్   (ఎ)

29. శరీరాన్ని మృదువుగా ఉంచే సబ్బుల తయారీలో వాడే రసాయనం?

ఎ) ఇథిలీన్ గ్లైకాల్ బి) ఇథైల్ ఆల్కహాల్ సి) మిథైల్ ఆల్కహాల్ డి) గ్లిజరాల్   (డి)

30. కిందివాటిలో కొలెస్ట్రాల్ అనేది ఏది?

ఎ) అమైనో ఆమ్లం బి) కార్బోహైడ్రేట్ సి) లిపిడ్ డి) ప్రోటీన్   (సి)

31. కిందివాటిలో ఇన్సులిన్ ఏది?

ఎ) ప్రోటీన్ బి) కార్బోహైడ్రేట్స్ సి) లిపిడ్ డి) హార్మో న్  (డి)

 32. రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్ ?

ఎ) టెస్టోస్టిరాల్ బి) ఇన్సులిన్ సి) థైరాక్సిన్ డి) గిబ్బర్లిన్   (బి)

33. మనిషి రక్తంలోని ప్రోటీన్ ఏది?

ఎ) కొలెస్ట్రాల్ బి) హీమోగ్లోబిన్ సి) కెసీన్ డి) కెఫిన్   (బి)

34. శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం వాడే రసాయనం?

ఎ) కెఫిన్ బి) శాకరిన్ సి) సిట్రోనెల్లా డి) వానిలిన్   (సి)

35. ఐస్ క్రీంల్లో వాడే వెనీలా ఫ్లేవర్  లో ఉండే రసాయనం?

ఎ) కెఫిన్ బి) శాకరిన్ సి) కుమరిన్ డి) లాక్టోస్  (సి)

 36. మనిషి శరీరం ఆకలితో అల్లాడినప్పుడు మెదడు పనిచేసేందుకు కండరాలు ఖర్చు చేసే పదార్థం?

ఎ) గ్లూకోజ్ బి) ఫ్రక్టోజ్ సి) కెఫిన్ డి) రెనిన్   (ఎ)

37. పొగాకులో ఉన్న మత్తుమందు?

ఎ) కెఫిన్ బి) నికోటిన్ సి) రెనిన్ డి) కొలెస్ట్రాల్   (బి)

38. టీ, కాఫీలో ఉండే ఉత్తేజితకారిణి?

ఎ) కెఫిన్ బి) నికోటిన్ సి) రెనిన్ డి) కొలెస్ట్రాల్    (ఎ)

39. దేనిలో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది?

ఎ) టీ బి) కాఫీ సి) కూల్ డ్రింక్స్ డి) బీరు    (సి)

40. టీ ని ఎక్కువసేపు మరిగిస్తే విడుదలయ్యే హానికారక సమ్మేళనాలు ఏవి?

ఎ) టేనిన్లు బి) ఫ్లేవనాయిడ్లు సి) కెరొటినాయిడ్లు డి) ప్రోటీన్లు   (ఎ)

 41. బ్రాండీలో ప్రధాన ఆల్కహాల్?

ఎ) ఇథైల్ బి) మిథైల్ సి) బ్యుటైల్ డి) ప్రొఫైల్   (ఎ)

42. ఎంజైమ్ లు అనేవి?

ఎ) కార్బోహైడ్రేట్స్ బి) ప్రోటీన్లు సి) లిపిడ్లు డి) ఏదీ కాదు   (బి)

 43. టమాట సాస్ లో ఉండే ఆమ్లం ఏది?

ఎ) ఆస్కార్బికామ్లం బి) సిట్రికామ్లం సి) ఎసిటికామ్లం డి) సల్ఫ్యూరికామ్లం   (సి)

 44. నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే రసాయనం?

ఎ) ఎసిటోన్ బి) ఫార్మలిన్ సి) వినిగార్ డి) బెంజిన్    (ఎ)

45. ద్రాక్షపళ్లలోని ఆమ్లం?

ఎ) ఎసిటికామ్లం బి) సిట్రికామ్లం సి) ఫార్మికామ్లం డి) ఫోలికామ్లం   (బి)

46. నల్లమందు (ఓపియం) తయారుచేసే విత్తనాలు?

ఎ) టమాట బి) పాపీ సి) వేప డి) మర్రి   (బి)

47. ఇథనోల్ ను దేని తయారీలో ఉపయోగిస్తారు?

ఎ) డిటర్జెంట్లు బి) సబ్బులు సి) షాంపూ డి) డై   (సి)

48. కిందివాటిలో కర్బన రసాయన ఎరువు?

ఎ) ఎన్ పీకే బి) పొటాషియం క్లోరైడ్ సి) యూరియా డి) సూపర్ ఫాస్పేట్  (సి)

 49. చేతులపై నైట్రికామ్లం పడ్డప్పుడు వేటితో చర్య జరపడం వల్ల పసుపు పచ్చగా మారుతుంది?

ఎ) కార్బోహైడ్రేట్స్ బి) ప్రోటీన్లు సి) అమైనో ఆమ్లాలు డి) లిపిడ్లు   (బి)

No comments:

Post a Comment