Pages

Sunday, June 17, 2018

Competitive Exams Special - Mechanical science

యాంత్రిక శాస్త్రం 
1. విరామంలో ఉన్న వస్తువు - ని కలిగి ఉంటుంది? -(జడత్వం)

2. మేఘాలు గాలిలో తేలుతూ ఉండటానికి కారణం? - (గాలి స్నిగ్ధత)

3. భారమితిలో పాదరసానికి బదులు నీటిని వాడితే వాతావరణ పీడనానికి సమానమైన నీటి స్తంభం ఎత్తు? - (10. 34 m)

4. అంతరిక్ష నౌకల్లో గ్లాస్ లోని నీటిని కిందికి వంచినా కింద పడకపోవడానికి అంతరిక్ష నౌకల్లో ......... ? - (భారం సున్నా)

5. రైలు వేగంగా ప్రయాణించేటప్పుడు పట్టాలకు దగ్గరగా నిల్చుంటే? - (గాలి రైలు వైపు లాగుతుంది)

6. సిలిండర్లలో ఉండే వాయు పీడనాన్ని కొలవడానికి వాడే పరికరం?  -(మానో మీటర్)

7. ఒక గోళాకార పాత్ర నుంచి నీరు కారిపోతున్నప్పుడు దాని గరిమనాభి స్థానంలో మార్పు?  - (మొదట కిందికి జరిగి మళ్లీ యథాస్థానానికి వస్తుంది)

8. "ఎర్గ్, జౌల్, ఎలక్ట్రాన్ ఓల్ట్, కెలోరీ" లలో శక్తికి అతిచిన్న ప్రమాణం? - (ఎలక్ట్రాన్ ఓల్ట్)

9. నీటిలో నిశ్చలస్థితిలో ఉన్న పడవపై ఒక వ్యక్తి ఒక చివర నుంచి మరో చివరకు నడిచినప్పుడు కలిగే మార్పు? - (వ్యక్తి ముందుకు నడిస్తే, పడవ వెనుకకు కదులుతుంది)

10. జిమ్నాస్టిక్స్ లో, స్విమ్మింగ్ పూల్ లో దూకే ముందు గాలిలో పల్టీలు కొట్టడానికి ఆధారమైన నియమం? - (కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం)

11. భూ ధృవాల దగ్గర ఉన్న మంచు కరిగితే ఒక రోజు కాలవ్యవధి?  - (పెరుగుతుంది)

12. "లప్పం, తుమ్మ బంక, మెత్తని ఇనుము, ఉక్కు" లలో అధిక "అస్థితి స్థాపక" పదార్ధం?  - (లప్పం)

13. కృష్ణ బిలం పరిణామక్రమం? - (అరుణ బృహత్తార,  శ్వేత వామన తార, దేదీప్యమాన నక్షత్రం, న్యూట్రాన్ నక్షత్రం)

14. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ?  - (6. 67 × 10⁻¹¹ Nm² . kg⁻²)

15. భూమధ్య రేఖ వద్ద కన్నా ధృవాల వద్ద గురుత్వత్వరణం విలువ కొద్దిగా ఎక్కువగా ఉండటానికి కారణం?  - (ధృవాల వద్ద భూవ్యాసార్ధం తక్కువ)

16. దీర్ఘ వృతానికి ఉండే నాభుల సంఖ్య? - (2)

17. సీలింగ్ ఫ్యాన్ లో బాల్ బేరింగుల పాత్ర?  - (జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చడానికి)

18. గ్రహ గమన నియమాలు తెలిపిన శాస్త్రవేత్త? - (కెప్లర్)

19. లాంగ్ జంప్ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంత దూరం నుంచి పరుగెత్తుకు రావడానికి కారణం?  - (గమన జడత్వం పొందడానికి)

20. లిఫ్ట్ పైకి త్వరణంలో వెళ్లేటప్పుడు వ్యక్తి బరువు?  - (దృశ్య భారం పెరుగుతుంది)

21. వస్తువు ద్రవ్య వేగం రెట్టింపు అయితే దాని గతిశక్తి?  - (నాలుగు రెట్లు అవుతుంది)

22. మైక్రో ఫోన్ లో శక్తి మార్పు?  - (ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది)

23. బంతిని ఎక్కువ దూరం విసరాలంటే క్షితిజ సమాంతరానికి ఎంత కోణంలో విసరాలి?  - (45°)

24. గంటకు 72 km వడితో ప్రయాణించే బస్సు ఒక సెకనులో ప్రయాణించే దూరం?  - (20 m)

25. స్వేచ్ఛగా భూమి వైపు పడుతున్న వస్తువు త్వరణం? - (𐍀²)

26. రైలులో ప్రయాణించే వ్యక్తి జారవిడిచిన వస్తువు ప్రయాణ మార్గం, బయట ఉన్న పరిశీలకుడుకి ఎలా కనిపిస్తుంది?  -(పరావలయ మార్గం)

27. 10 నిముషాల్లో ఒక వ్యక్తి అర కిలోమీటర్ దూరం నడిస్తే, అతడి వడి ఎంత? - (0. 83 m / s)

28. శుద్ధ గతిశాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించని అంశం?  - (బలం)

29. మంచు నీటిలో తేలడానికి కారణం నీటి కంటే మంచు?  - (సాంద్రత తక్కువ)

30. రిజర్వాయర్లలో నీటిని టి ఎం సి లలో కొలుస్తారు. టి ఎం సి  అంటే?  - (Thousand million cubic feet)

31. పేపర్ నాణ్యతను GSM లలో తెలియచేస్తారు. GSM అంటే?  - (Grams per square meter)

32. వస్తువు ద్రవ్యరాశి కేంద్రం గురుంచి సరైనది? - (ద్రవ్యరాశి కేంద్రం వద్ద ద్రవ్యరాశి ఉండాల్సిన అవసరం లేదు)

33. ఊయలలో ఊగుతున్న వ్యక్తి, కూర్చున్న స్థానం నుంచి నిలబడితే ఊయల ?  - (వేగంగా ఊగుతుంది)

34. ఓడ నిర్మాణం ఏ రకమైన నిశ్చలస్థితిని కలిగి ఉంటుంది? - (స్థిర నిశ్చలస్థితి)

No comments:

Post a Comment