Pages

Sunday, June 10, 2018

Competitive Exams Special - Jeeva parinamam - Biology

1. జీవులు నిర్జీవ పదార్థాలు నుంచి ఏర్పడతాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? - (అరిస్టాటిల్)

2. జీవులు తమ వంటి జీవుల నుంచే ఉద్భవిస్తాయని తెలిపిన  శాస్త్రవేత్త? - (లూయీ పాశ్చర్)

3. ఉపయుక్త - నిరుపయుక్త సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? - (లామార్క్)

4. ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? - (డార్విన్)

5. పరిణామశాస్త్ర పితామహుడు ఎవరు? - (డార్విన్)

6. "మనుగడ కోసం పోరాటం" అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? - (డార్విన్)

7. మానవునిలో సుమారు ఎన్ని అవశేషావయవాలు ఉన్నాయి? - (180)

8. "జ్ఞాన దంతాలు, ఉండుకం, రొమ్ము రోమాలు" లో అవశేషావయవం ఏవి? - (అన్నీ)

9. ప్రతి జీవి తన పిండదశల ద్వారా పూర్వీకుల దశలను స్పరించుకుంటుందని తెలిపిన శాస్త్రవేత్త? - (ఎర్నస్ట్ హెకెల్)

10. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? - (డీవ్రిస్)

11. మొక్కలను, జంతువులను కలిపే సంధాన జీవి? - (యూగ్లీనా)

12. జీవుల, నిర్జీవుల లక్షణాలను చూపేది?- (వైరస్)

13. శిలాజాల వయసును దేని ఆధారంగా నిర్ణయిస్తారు? - (రేడియో యాక్టివ్ కార్బన్)

14. నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ? - (పక్షి, గబ్బిలం రెక్కలు)

15. క్రియా సామ్య అవయవాలకు ఉదాహరణ? - (పక్షి, సీతాకోక చిలుక రెక్కలు)

16. "జిరాఫీ, గొరిల్లా, ఏనుగు, సినాంద్రోపస్" వీటిలో మానవునికి అతిదగ్గర ప్రైమేట్? - (సినాంద్రోపస్)

17. పెకింగ్ మానవుని పేరు? - (సినాంద్రోపస్)

18. క్రోమాగ్నన్ మానవుని లక్షణం? - (మాంసాహారి)

19. "హోమో సెపియన్స్" ఏ జీవి శాస్త్రీయ నామం? - (మానవుడు)

20. ఫ్లిస్టోసీన్ కాలంలో నివసించిన మానవుని పూర్వీకుడు? - (నియాండర్తల్ మానవుడు)

21. జీవశాస్త్రం ప్రకారం పరిణామం అంటే? - (విచ్చుకోవడం)

22. భూమిపై మొట్టమొదట ఏర్పడిన జీవి ఏది? - (సయనో బాక్టీరియా)

23. శిలాజాల గురించి చేసే అధ్యయనం? - (పేలియంటాలజి)

24. "మాగట్" అనేది ఏ జీవి లార్వా? - (ఈగ)

25. "టర్టిల్, గబ్బిలం, కప్ప, చేప" వీటిలో జీవ పరిణామం ఆధారంగా అతి ప్రాథమిక జీవి ఏది? - (చేప)

26. "డి ఎన్ ఎ, ప్రోటీన్, కార్బో హైడ్రేట్" వీటిలో జీవ అణువు ఏది? - (అన్ని)

27. న్యూక్లియోటైడ్ అంటే? - (నత్రజని క్షారం, చెక్కెర, పాస్పెట్)

28. న్యూక్లియోసైడ్ అంటే? - (నత్రజని క్షారం, చెక్కెర)

29. ప్రొటీన్ల నిర్మాణాత్మక ప్రమాణం ఏది? - (అమైనో ఆమ్లం)

30. బ్యాక్టీరియా, రిట్రో వైరస్, సయనో బ్యాక్టీరియా" వీటిలో ఏ జీవి "సెంట్రల్ డాగ్మా" సూత్రాన్ని పాటించడు? - (రిట్రో వైరస్)

31. "ప్లాస్మిడ్, కాస్మిడ్, ఫెజ్మిడ్" వీటిలో దేన్ని జీవ సాంకేతికశాస్త్రంలో వాహకంగా ఉపయోగిస్తారు? - (అన్నీ)

32." డి ఎన్ ఎ" ను కత్తిరించడానికి ఉపయోగించే ఎంజైమ్ ఏది?  -(రిస్ట్రిక్షన్ న్యూక్లియేజ్)

33. "అణు కత్తెరలు" అని వేటిని అంటారు? - (రిస్ట్రిక్షన్ న్యూక్లియేజ్)

34. " డి ఎన్ ఎ" లో లేని నత్రజని క్షారం ఏది? - (యూరాసిల్)

35. "ఆర్ ఎన్ ఎ" లో లేని నత్రజని క్షారం ఏది? - (థైమిన్)

No comments:

Post a Comment