Pages

Thursday, December 16, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం : మొక్కల కణం, కణజాలాలు

 పోటీ పరీక్షల ప్రత్యేకం : మొక్కల కణం, కణజాలాలు

1. ఒకే రకమైన నిర్మాణంతో, ఒకే విధి నిర్వర్తించే కణసమూహాన్ని ఏమంటారు?

జ. కణజాలం

2. మొక్కల కణజాలాలు ఎన్ని రకాలు. అవి ఏవి ?

 జ. 2 అవి 1. సరళ కణజాలాలు 2. సంక్లిష్ట కణజాలాలు 

3. ఒకే రకమైన కణాలు కలిగిన కణజాలాన్ని ఏమంటారు?

జ. సరళ కణజాలం

4. సరళ కణజాలాలకు ఉదాహరణ? 

జ. మృదు కణజాలం, దృడ కణజాలం, స్థూలకోణ కణజాలం 

5. రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల కణాలు ఉన్న కణ జాలాన్ని ఏమంటారు?

 జ. సంక్లిష్ట కణజాలం 

6. సంక్లిష్ట కణజాలానికి ఉదాహరణ ?

జ. దారువు, పోషక కణజాలం

7. లేత మొక్కల భాగాలు ఏ కణజాల నిర్మితాలు? 

జ. మృదు కణజాలం

 8. పత్రాల్లో ఉండే మృదు కణజాల రకం ?

 జ. క్లోరైంఖైమా (హరిత మృదు కణజాలం) 

9. హైడ్రోఫైట్స్ లో ఉండే మృదు కణజాల రకం? 

జ. ఏరైంఖైమా (వాయు పూరిత మృదు కణజాలం)

10. నీటిమీద తెలియాడే మొక్కలను ఏమంటారు?

జ. హైడ్రోఫైట్స్ 

 11. ఏ కణజాలంలోని కణాల మధ్య వాయుగదులు ఉంటాయి ?

జ. ఏరైంఖైమా (వాయు పూరిత మృదు కణజాలం)

12. దుంపలు, కొమ్ముల్లో ఉండే మృదుకణజాలం ?

జ. నిలువ కణజాలం

 13. ఎడారి మొక్కలు నీటిని నిలువ చేయడానికి సహాయపడే కణజాలం - ?

 జ. నీటిని నిలువచేసే మృదుకణజాలం

 14. పత్రాల్లోని మృదు కణజాలాన్నేమంటారు ? 

జ. పత్రాంతరం

 15. గుల్మాలు, పొదల్లో ఎక్కువగా ఉండే కణజాలం? 

జ. స్థూల కోణ కణజాలం 

16. మొక్కలకి యాంత్రిక బలాన్ని, ఆధారాన్నిచ్చే కణజాలం? 

జ. స్థూల కోణ కణజాలం 

17. ఏ కణజాలంలోని కణ కవచాలు సెల్యులోజ్, పెక్టిన్లతో నిర్మితమై ఉంటాయి? 

జ. స్థూలకోణ కణజాలం 

18. సరళ, సజీవ యాంత్రిక కణజాలం ? 

జ. స్థూల కోణ కణజాలం 

19. మొక్కల్లో ఉండే నిర్జీవ కణజాలం? 

జ. దృఢ కణజాలం 

20. దృడ కణజాలంలోని కణాల కణకవచాల్లో ఉండే పదార్థం - ?

 జ. లిగ్నిన్

21. మృదు కణజాలం వంగినపుడు, సాగిల పడినపుడు కాపాడే కణజాలం ?

 జ. దృఢ కణజాలం 

22. మొక్కల్లో ఉండే ప్రసరణ కణజాలం?

 జ. దారువు 

23. ఏ కణజాలంలో సజీవ, నిర్జీవ కణాలుంటాయి ?

జ. దారు కణజాలం

24. దారువులో నిర్జీవ కణాలు?

జ. నారలు, దారు కణాలు, దారు నాళాలు

25. దారు కణజాలంలోని సజీవ కణజాలం?

జ. దారు మృదు కణజాలం

 26. మొక్కల్లో నీటిని, లవణాలను వేర్ల నుంచి మొక్క భాగాలకు సరఫరా చేసే కణజాలం ?

జ. దారు కణజాలం

27. మొక్కల్లోని ఏ కణజాలాన్ని 'బాస్టు' లేదా 'లెప్టోమ్' అంటారు ?

జ. పోషక కణజాలం

28. పోషక కణజాలంలోని కణకవచాల్లో ఉండే పదార్థం? 

జ. లిగ్నిన్ 

29. పోషక కణజాలంలో ఉండే కణాలు?

 జ. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు, మృదు కణజాలం

30. చాలనీ నాళాల చివర ఎక్కువ రంధ్రాలు కలిగిన నిర్మాణం?

 జ. చాలనీ ఫలకం

 31. ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ఉపయోగపడే కణజాలం? 

జ. పోషక కణజాలం

32. తాళ్ళ తయారీలో ఉపయోగపడే పోషక కణజాల కణాలు? 

జ. పోషక కణజాల నారలు

No comments:

Post a Comment