Pages

Tuesday, May 29, 2018

General Studies - Uses of Biotechnology

 జీవసాంకేతిక శాస్త్రం - ఉపయోగాలు 
1. బ్రెడ్ తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవి? - (ఈస్ట్)

2. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా? - (లాక్టో బాసిల్లై)

3. మొలాసిస్ నుంచి కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ ను ఉత్పత్తి చేసే జీవి? - (శఖారోమైసిన్)

4. కిణ్వనం ద్వారా సిట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే జీవి? - (ఆస్పర్ జిల్లస్)

5. కిణ్వన ప్రక్రియ ద్వారా - - -  ఉత్పత్తి అవుతాయి? - (బ్రెడ్, పెరుగు, ఆల్కహాల్)

6. కిణ్వన ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వాయువు? - (కార్బన్ డై ఆక్సైడ్)

7. పెన్సిలిన్, ఇన్సులిన్, స్ట్రెప్టో మైసిన్ లలో సూక్ష్మ జీవ నాశకం కానిది ఏది? - (ఇన్సులిన్)

8. అతిథేయి శరీరంలో ఇంటర్ ఫెరాన్లను ఉత్పత్తి చేసే వ్యాధికారక జీవి? - (వైరస్)

9. సిట్రిక్ ఆమ్లం, పెన్సిలిన్, స్ట్రెప్టో మైసిన్ లలో శిలీంధ్రంతో ఉత్పత్తి కానిది ఏది? - (స్ట్రెప్టో మైసిన్)

10. పెన్సిలిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (అలెగ్జాండర్ ఫ్లెమింగ్)

11. బ్యాక్టీరియా తో ఉత్పత్తి అయ్యే పదార్థాలు? - (పెరుగు, స్ట్రెప్టో మైసిన్, వెనిగర్)

12. నేలలో నత్రజని శాతాన్ని పెంచే బ్యాక్టీరియా ఏది? - (రైజోబియం)

13. "సూపర్ బగ్" అని ఏ బ్యాక్టీరియా ను పిలుస్తారు? - (సూడోమోనాస్)

14. BCG వ్యాక్సిన్ ఏ వ్యాధిని నివారిస్తుంది? - (క్షయ)

15. పెన్సిలిన్ ను ఏ సూక్ష్మజీవి లో కనుగొన్నారు? - (శిలీంధ్రం)

16. స్పైరులీన, లాక్టో బాసిల్లస్, అగరో బ్యాక్టీరియం ఏ జీవిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి? - (స్పైరులీన)

17. ఏ బ్యాక్టీరియాను, నీటి కాలుష్యాన్ని తెలుసుకునే ఇండికేటర్ జీవిగా ఉపయోగిస్తారు? - (ఎశ్చరీషియా కొలై)

18. సాక్, సాబిన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్న వ్యాక్సిన్ ఏది? - (పోలియో)

19. జీవకీటక నాశినిగా ఉపయోగపడే  బ్యాక్టీరియా? - (బాసిల్లస్ తురింజెనిసిస్)

20. పాశ్చరైజేషన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (లూయిస్ పాశ్చర్)

21. రెటీనాలో లోపాన్ని నివారించే జన్యు మార్పిడి మొక్క? - (గోల్డెన్ రైస్)

22. - సూక్ష్మ జీవి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ను పారిశ్రామికంగా ఉత్పత్తి చేస్తున్నారు? - (ఎశ్చరీషియా కొలై)

23. జన్యు ఇంజనీరింగ్ పద్దతి ద్వారా హెపటైటిస్ - బి వ్యాక్సిన్ ను తయారు చేసిన సంస్థ? - (శాంతా బయోటెక్)

24. భారత్ లో మొట్టమొదట రోటా వైరస్ వ్యాక్సిన్ ను తయారుచేసిన సంస్థ? - (భారత్ బయోటెక్)

25. జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియలో DNA ను కత్తిరించడానికి ఉపయోగించే ఎంజైములను ఏమంటారు? - (అణు కత్తెరలు) 

26. భారత్ లో మొట్టమొదటి జన్యు మార్పిడి పంట? - (బిటి పత్తి)

27. క్లోనింగ్ పద్దతి ద్వారా పుట్టిన మొట్టమొదటి క్షీరదం? - (గొర్రెపిల్ల)

28. క్లోనింగ్ పద్దతి ద్వారా తొలిసారిగా గేదెను పుట్టించిన దేశం? - (భారత్)

29. క్లోనింగ్ ద్వారా పుట్టిన మొట్టమొదటి గేదె పేరు? - (సంరూప)

30. ప్రపంచంలో మొట్టమొదటి సారి క్లోనింగ్ ద్వారా పాశ్మిన మేకను పుట్టించిన దేశం? - (భారత్)

31. "మిషన్ ఇంద్రధనుష్" ద్వారా ఏ వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ ఇస్తారు? - (డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, క్షయ, పోలియో, హెపటైటిస్ - బి, మీజిల్స్)

32. జన్యు ఇంజనీరింగ్ పద్దతి ద్వారా హెపటైటిస్ - బి వ్యాక్సిన్ ను ఏ జీవిలో ఉత్పత్తి చేస్తున్నారు? - (ఈస్ట్)

33. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ను ఎవరు కనుగొన్నారు? - (సాబిన్)

34. వ్యాక్సిన్ ను మొట్టమొదట ఎవరు కనుగొన్నారు? - (ఎడ్వర్డ్ జెన్నర్)

35. "బేకర్స్ ఈస్ట్" అని దేన్ని పిలుస్తారు? - (శఖారో మైసిన్)

36. "హ్యుమిలిన్" అంటే? - (జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఉత్పత్తి  చేసిన ఇన్సులిన్)

37. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు? - (స్వామి నాథన్)

38. జైమాలజి అంటే?- (కిణ్వనం గురించిన అధ్యయనం)

39. రోటా వైరస్ వ్యాక్సిన్ ఏ వ్యాధిని నివారిస్తుంది? - (డయేరియా)

40. స్ట్రెప్టో మైసిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (వాక్స్ మన్)

No comments:

Post a Comment