Pages

Thursday, December 16, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం : జంతు కణజాలాలు

 పోటీ పరీక్షల ప్రత్యేకం : జంతు కణజాలాలు

1. పనిచేసే విధానాన్ని బట్టి జంతు కణజాలాన్ని ఎన్ని రకాలుగా విభజించారు ?

జ. 4 రకాలు; 1. ఉపకళా కణజాలం 2. సంయోజక కణజాలం 3. కండర కణజాలం 4. నాడీ కణజాలం 

2. శరీరాన్ని బాహ్య తలం, అంతఃతలంలో కప్పి ఉంచే పొర? 

జ. ఉపకళా కణజాలం

3. గోర్లు, రోమాలు, కొమ్ముల వంటి నిర్మాణాల్లో ఉండే కణజాలం?

జ. ఉపకళా కణజాలం

4. ఉపకళా కణాలు ఒకే వరుసలో అమరి ఉంటే దానిని ఏమంటారు?

జ. సరళ ఉపకళ కణజాలం

5. ఉపకళా కణజాలం అనేక వరుసల్లో ఉండే దానిని ఏమంటారు ?

జ. స్ట్రాటిఫైడ్ కణజాలం

6. వివిధ కణజాలాలను, అంగాలను కలిపి ఉంచే కణజాలం ?

జ. సంయోజక కణజాలం

7. ఓ కణజాలం నుంచి వేరొక కణజాలానికి పదార్థాలను చేరవేసే కణజాలం?

జ. సంయోజక కణజాలం 

8. శరీరంలో కొవ్వులను నిలువచేసే కణజాలం ?

 జ. సంయోజక కణజాలం

9. కణజాలాలను కలిపి ఉంచి, అంతర్భాగాలను వాటి స్థానంలో ఉండేట్లు చేసే కణజాలం? 

జ. ఏరియోలార్ కణజాలం

10. ఏ కణజాలంలో ఫైబ్రోబ్లాస్టులు అనే నిర్మాణాలు ఉంటాయి?

 జ. ఏరియోలార్ కణజాలం 

11. ఎముకలు కలిసే చోట, పక్కటెముకల చివర, వాయునాళంలో ఉండే సంయోజక కణజాలం?

జ. మృదులాస్థి

12. సకశేరుక జీవుల పిండదశలో మాత్రమే ఉండే కణజాలం?

జ. మృదులాస్థి కణజాలం 

13. సొరచేపల్లో అస్థిపంజరం దేనితో నిర్మితమై ఉంటుంది ? 

జ. మృదులాస్థి కణజాలం 

14. సకశేరుకాల్లో ఉండే అస్థిపంజరం దేనితో నిర్మితమై ఉంటుంది ? 

జ. ఎముకతో

15. ఎముక సంయోజక కణజాలం ఏఏ పదార్థాలతో ఏర్పడింది ?

జ. కాల్షియం ఫాస్పేటు, కాల్షియం కార్బొనేట్

16. ఎముకలోని లవణాలను స్రవించే కణాలు?

 జ. ఆస్టియో సైట్ కణాలు

17. ఎముకలోని అస్థిమజ్జలో ఉండే కణాలు ?

 జ. ఆస్టియోసైట్ కణాలు 

18. ఎముకల సంధి తలాలను కలిపి వుంచే కణజాలం ? 

జ. లిగమెంట్ లేదా సంధి బంధన కణజాలం

19. సంధి బంధనంలోని తంతువులు ఏ పదార్థంతో నిర్మితమయ్యాయి? 

జ. కొల్లాజెన్ అనే ప్రొటీతో 

20. కండరాలను, ఎముకలతో కలిపి సంధితలాల జాయింట్లలో ఉండే కణజాలం?

జ. టెండాన్ లేదా స్నాయు బంధన కణజాలం

21. కొవ్వు పదార్థాన్ని నిలువచేసే సంయోజక కణజాలం?

 జ. ఎడిపోస్ కణజాలం

22. ఎడిపోస్ కణజాలం ఏ కణాల నుంచి ఏర్పడుతుంది ?

 జ. ఎడిపోసైట్ కణాలు 

23. ఉపవాస సమయాల్లో శరీరానికి కావలసిన శక్తిని అందించే కణజాలం? 

జ. ఎడిపోస్ కణజాలం 

24. శరీరం నుంచి వేడి బయటకు పోకుండా ఆపే కణజాలం?

జ. ఎడిపోస్ కణజాలం

25. మానవ శరీరంలో ఉన్న ద్రవరూప కణజాలం?

జ. రక్తం 

26. కణబాహ్య ప్రదేశం ఏ పదార్థంతో నిండి ఉంటుంది? 

జ. ప్లాస్మాతో 

27. ప్లాస్మాలో ముఖ్యమైన పదార్థం?

 జ. నీరు

28. మానవుడిలో దాదాపు ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ? 

జ. 5 లీటర్లు

29. రక్తస్కందనానికి కావలసిన కారకాలు దేనిలో ఉంటాయి?

జ. ప్లాస్మాలో

30. ఎర్రరక్తకణాలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ? 

జ. హీమోగ్లోబిన్

31. ఏ జంతువుల్లో ఎర్ర రక్తకణాలు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ?

జ. చేపలు, ఉభయ చరాలు, సరీసృపాలు

32. ఎర్ర రక్తకణాల ఆకారం ?

జ. ద్వి పుటాకారం

33. ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ రవాణాలో సహాయపడే కారకం? 

జ. హీమోగ్లోబిన్

34. ఓ హీమోగ్లోబిన్ అణువు ఎన్ని ఆక్సిజన్ పరమాణువులను రవాణా చేస్తుంది?

జ. నాలుగు

35. ఎర్ర రక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?

జ. అస్థిమజ్జలో 

36. ఎర్ర రక్తకణాల జీవిత కాలం ?

జ. 120 రోజులు

37. ఎర్ర రక్తకణాలకు మరో పేరు ?

 జ. ఎరిత్రో  సైటులు 

38. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఏమంటారు ? 

జ. ఎరిత్రోపాయిసిస్

39. తెల్ల రక్తకణాలు ఎన్ని రకాలు, అవి ఏవి? 

జ. 2 రకాలు 1. కణికాభ కణాలు 2. కలికరహిత కణాలు 

40. కణికాభ కణాలు ఎన్ని రకాలు, అవిఏవి ? 

జ. 3 రకాలు 1. నూట్రోఫిల్స్ 2 బేసోఫిల్స్ 3. అసిడోఫిల్స్ 

41. కణిక రహిత కణాలు ఎన్ని రకాలు, అవి ఏవి? 

జ. 2 రకాలు 1. లింఫోసైట్స్ 2. మోనోసైట్స్ 

42. రక్తలోని ఏ కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి ?

 జ. లింఫోసైట్స్

43. జీవుల పూర్వ, చరమాంగాల కదలికకు, అంతరంగాల కదలికకు తోడ్పడే కణజాలం?

 జ. కండర కణజాలం 

44. హృదయం ఏ కణజాల నిర్మితం?

జ. కండర కణజాలం

45. కండరాలు ఎన్ని రకాలు, అవి ఏవి?

జ. 3 రకాలు 1. రేఖిత కండరాలు 2. అరేఖిత కండరాలు 3. హృదయ కండరం 

46. అస్థిపంజరంలోని ఎముకల కదలికకు తోడ్పడే కండరాలు ?

 జ. రేఖిత కండరాలు 

47. రేఖిత కండరాలకు మరో పేరు?

జ. నియంత్రిత కండరాలు

48. కండరం పొడవునా అడ్డుచారలు కలిగి ఉండేది?

జ. రేఖిత కండరం

49. పొట్టిగా, కదురు ఆకారంలో, అడ్డుచారలు లేని కండరం ?

జ. అరేఖిత లేదా నునుపు కండరం

50. శరీరంలో అనియంత్రిత కండరాలు ?

జ. అరేఖిత కండరాలు

51. నిర్మాణంలో చారల కండరాన్ని పోలి ఉన్నా అనియంత్రిత చర్యలను చూపే కండరం?

జ. హృదయ కండరం

52. నాడీ మండలంలోని కణాలు ?

జ. 1. నాడీ కణాలు, 2. గ్లియల్ కణాలు

53. ఆక్జాన్ ను ఆవరించి ఉన్న పొర?

జ. మయిలీన్ తొడుగు

54. నాడీ కణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మ ప్రమాణం?

జ. న్యూరాన్

55. నాడీ ఉత్తేజితమయినపుడు కణదేహం వద్ద ఏర్పడే విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు ? 

జ. యాక్షన్ పొటెన్షియల్ 

56. యాక్షన్ పొటెన్షియల్ విలువ ? 

జ. 0.055 వోల్ట్ 

57. నాడీకణంలోని కణదేహం కలిగి ఉండే కణికలు ?

 జ. నిస్సల్ కణికలు 

58. న్యూరాన్లు దేనిద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి? 

జ. డెండ్రైట్స్ 

59. అరేఖిత కండరాలు ఎక్కువగా ఏ భాగాల్లో ఉంటాయి? 

జ. రక్త నాళాలు, పేగులు 

60. నాడీ తంతువుల కట్టను ఏమంటారు ? 

జ. ప్యునిక్యులస్

No comments:

Post a Comment