Pages

Tuesday, December 14, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - నియంత్రణ- సమన్వయం

 నియంత్రణ- సమన్వయం 

1. జంతువుల్లో హార్మోనుల ద్వారా జరిగే రసాయనిక సమన్వయం వేటి ద్వారా జరగుతుంది ?

 జవాబు:  వినాళ గ్రంధులు వల్ల 

2. రసాయన పదార్థాల విడుదలను బట్టి గ్రంధులు ఎన్ని రకాలు ? అవి ఏవి ?

 జవాబు: రెండు రకాలు. 1) నాళ సహిత గ్రంధులు 2) వినాళ గ్రంథులు 

3. ఆహార నాళంతో సంబంధం ఉన్న గ్రంధులు ఏవి ?

జవాబు: నాళ సహిత గ్రంధులు

4. ఆహార నాళంతో సంబంధం లేకుండా ఉండే అంతఃస్రావీ గ్రంధులు ఏవి? 

జవాబు: వినాళ గ్రంధులు 

5. వినాళ గ్రంధులు విడుదల చేసే రసాయన పదార్థాలను ఏమంటారు?

జవాబు: హార్మోన్లు

 6. హార్మోన్లు చర్య జరిపే కణజాలాన్ని లేదా అంగాన్ని ఏమంటారు ? 

జవాబు: నిర్వాహక అంగం లేదా నిర్వాహక కణజాలం 

7. శరీరంలో అతి ప్రధాన గ్రంధి ఏది?

జవాబు: పీయూష గ్రంధి 

8. శరీరంలోని అన్ని ఇతర అంతఃస్రావీ గ్రంధులు ఏ గ్రంధి ఆధీనంలో ఉంటాయి ?

జవాబు: పీయూష గ్రంధి

 9. నాడీ వ్యవస్థకి, అంతఃస్రావీ వ్యవస్థకు మధ్య వారధిలా పనిచేసే గ్రంధి ఏది? 

జవాబు: పీయూష గ్రంధి 

10. పీయూష గ్రంధి స్రవించే హార్మోన్లు ఏవి? 

జవాబు: పెరుగుదల హార్మోను, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, లూటినైజింగ్ హార్మోను, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. 

11. చిన్న తనంలో పెరుగుదల హార్మోను తక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే లోపం ఏది?

జవాబు: మరుగుజ్జుతనం

12. చిన్నతనంలో పెరుగుదల హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే లోపం ఏది?

జవాబు: అతి దీర్ఘకాయత్వం

1 3. తగినంత పరిమాణంలో వాసోప్రెసిన్ ఉత్పత్తి కాక అతి మూత్ర విసర్జన జరగడాన్నేమంటారు?

జవాబు: డయాబిటస్ ఇన్ సిపిడస్ (Diabetes Insipidus) 

14. ప్రసవం తర్వాత స్థన గ్రంధులపై చర్య జరిపి క్షీరోత్పత్తిని ప్రోత్సహించే హార్మోన్ ఏది? 

జవాబు: ప్రొలాక్టిన్ (Prolactin) 

15. అండం విడుదలలో పాత్ర వహించే హార్మోన్ ఏది ? 

జవాబు: లూటినైజింగ్ హార్మోన్ 

16. ప్రసవ సమయంలో గర్భాశయ కుడ్యం సంకోచానికి తోడ్పడే హార్మోన్ ఏది? 

జవాబు: ఆక్సిటోసిన్ 

17. స్త్రీలలో ఈస్ట్రోజన్, పురుషల్లో టెస్టోస్టిరాన్ స్రావాన్ని ప్రోత్సహించే హార్మోన్ ఏది? 

జవాబు: ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 

18. ప్రొజెస్టిరాన్ స్రావాన్ని ప్రోత్సహించే హార్మోన్ ఏది?

జవాబు: లూటినైజింగ్ హార్మోన్ 

19. మెడలో వాయు నాళానికి దగ్గరగా ఉండే గ్రంధి ఏది? 

జవాబు: అవటు గ్రంధి లేదా థైరాయిడ్ గ్రంధి

20. థైరాక్సిన్ హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంధి ఏది ?

జవాబు: అవటు గ్రంధి

 21. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది?

జవాబు: అయోడిన్

 22. ఏ హార్మోన్ జీవక్రియారేటును పెంచి, శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది? 

జవాబు: థైరాక్సిన్ 

23. తగినంత థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోతే, శరీరం పెరుగుదల తక్కువై పిల్లలు మానసికంగా ఎదగలేని స్థితిని ఏమంటారు? 

జవాబు: క్రిటినిజమ్ 

24. ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోవడం వల్ల కలిగే వ్యాధి ?

జవాబు: సామాన్య గాయిటర్ 

25. అవటు గ్రంధికి దగ్గరలో ఉండే గ్రంధులు ఏవి? 

జవాబు: పార్శ్వ అవటు గ్రంధులు (Parathyroid Glaud) 

26. పారా థైరాయిడ్ గ్రంధి విడుదల చేసే హార్మోన్ ఏది ?

జవాబు: పారాథార్మోను 

27. రక్తం, ఎముకల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫేటుల స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? 

జవాబు: పారాథార్మోను(Parathormone)

 28. పారాథార్మోను ఎక్కువగా ఉండడం వల్ల కండరాలు ఉత్తేజపడి, సంకోచ స్థితిలోనే ఉండే స్థితిని ఏమంటారు ? 

జవాబు: టిటాని

 29. మూత్రపిండంపై ఉండే గ్రంధి ఏది  ?

జవాబు: అడ్రినల్ గ్రంధి 

30. అధివృక్క గ్రంధి బయటి, లోపలి భాగాలను ఏమంటారు?

జవాబు: వల్కలం ,  దవ్వ

 32. వల్కలం స్రవించే హార్మోన్లు ఏవి? 

జవాబు: కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ 

33. కార్బోహైడ్రేట్లు, ప్రొటీనులు, కొవ్వుల జీవక్రియను క్రమబద్ధం చేసే హార్మోన్ ఏది? 

జవాబు: కార్టిసాల్ 

34. శరీరంలో నీరు, సోడియంల పునః శోషణలో పాత్ర వహించి రక్తంలో సోడియం స్థాయిని పునరుద్ధరించే హార్మోన్ ఏది? 

జవాబు: ఆల్డోస్టిరాన్ 

35. దవ్వ(అధివృక్క గ్రంధి లోపలి భాగం)  స్రవించే హార్మోన్  ఏది? 

జవాబు:ఎడ్రినలిన్

36. మానసిక ఉద్రేకాలను కలుగజేసే హార్మోన్ ఏది? 

జవాబు: ఎడ్రినలిన్ 

37. మిశ్రమ గ్రంధి ఏది?

జవాబు: క్లోమం

 38. కొంత భాగం నాళాలు,మరి కొంత భాగం అంతఃస్రావీ గ్రంధిగా (నాళ రహితం) ఉండే గ్రంధి ఏది?

జవాబు: క్లోమం 

39. క్లోమంలోని అంతఃస్రావీ కణాలను ఏమంటారు? 

జవాబు: లాంగర్ హన్స్ పుటికలు 

40. లాంగర్‌హాన్స్ పుటికలు స్రవించే హార్మోన్లు ఏవి ? 

జవాబు: ఇన్సులిన్, గ్లూకగాన్ 

41. గ్లూకోజును, గ్లైకోజన్ గా మార్చే హార్మోన్  ఏది?

జవాబు: ఇన్సులిన్(Insulin)

 42. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగి అది మూత్రంతో పాటు విసర్జితమవడాన్ని ఏమంటారు ? 

జవాబు: డయాబిటస్ మిల్లిటస్ 

43. గ్లైకోజన్‌ను గ్లూకోజుగా మార్చడంలో తోడ్పడే హార్మోన్  ఏది? 

జవాబు: గ్లూకగాన్ 

44. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువయినప్పుడు విడుదలయ్యే హార్మోన్  ఏది ?

జవాబు: ఇన్సులిన్ 

45. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తక్కువయినప్పుడు విడుదలయ్యే హార్మోన్  ఏది? 

జవాబు:. గ్లూకగాన్ 

46. ముష్కాలు స్రవించే పురుష లైంగిక హార్మోన్ పేరు?

జవాబు: టెస్టోస్టిరాన్

 47. ప్రోస్టేట్ గ్రంధులు, శుక్రాశయాల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ పేరు? 

జవాబు: టెస్టోస్టిరాన్

48. పురుషల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో తోడ్పడే హార్మోన్ ఏది? 

జవాబు: టెస్టోస్టిరాన్ 

49. టెస్టోస్టిరాన్ విడుదల కాకపోతే , పురుష లక్షణాలు అభివృద్ధి చెందని పరిస్థితిని ఏమంటారు ?

జవాబు: నపుంసకత్వం 

50. స్త్రీ బీజ కోశాలు స్రవించే హార్మోన్లు పేర్లు? 

జవాబు: ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ 

51. గర్భాశయం, స్థన గ్రంధులు, పాలోపియన్ నాళాల అభివృద్ధిలో తోడ్పడే హార్మోన్ పేరు? 

జవాబు: ఈస్ట్రోజన్ (Oestrogen)

 52. స్త్రీలల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ పేరు ?

జవాబు: ఈస్ట్రోజన్

 53. గర్భధారణ సమయంలో గర్భాశయం పెరగడానికి, పిండ ప్రతిస్థాపనకు జరాయువు ఏర్పడడానికి తోడ్పడే హార్మోన్  పేరు? 

జవాబు:. ప్రొజెస్టిరాన్ (Progesterone) 

54. ఏ హార్మోన్ లోపం వల్ల ఎముకలు కాల్షియంను కోల్పోయి మెత్తగా అవుతాయి? 

జవాబు: పారాథార్మాన్ 

55. పురుషుల్లో నపుంసకత్వానికి కారణమైన హార్మోన్ పేరు? 

జవాబు: టెస్టోస్టిరాన్

No comments:

Post a Comment