Pages

Thursday, August 2, 2018

Group - 4 Exam Special General Knowledge Questions in Biology

1. మానవుని జీవితకాలంలో రెండుసార్లు ఏర్పడే దంతాలు ఎన్ని? - (20)
వివరణ: చిన్నపిల్లల్లో ఉండే 20 పాలదంతాలు ఊడిపోయి తిరిగి ఏర్పడతాయి.

2. "కాలేయం, క్లోమం, అవటుగ్రంథి, జఠర గ్రంథి" లలో మిశ్రమ గ్రంథి ఏది? - (క్లోమం)
వివరణ:  అంతః, బాహ్య స్రావక గ్రంథిగా రెండు రకాలుగా పనిచేసే గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు. క్లోమము రెండురకాల గ్రంథిగా పనిచేస్తుంది.

3. మానవుని సాధారణ నాడీ పీడనం ఎంత? - (40)
వివరణ: సిస్టోలిక్ పీడనం, డయాస్టోలిక్ పీడనాల మధ్య గల భేదాన్ని నాడీ పీడనం అంటారు. మానవుని  సిస్టోలిక్ పీడనం 120, డయాస్టోలిక్ పీడనం 80. కనుక నాడీ పీడనం 40. (120 - 80 = 40)

4. "విశ్వదాత" అని ఏ రక్తవర్గాన్ని అంటారు? - (O నెగెటివ్)
వివరణ: నెగెటివ్ రక్తవర్గం గల వ్యక్తులు పాజిటివ్ రక్తాన్ని తీసుకొనరాదు. పాజిటివ్ రక్తవర్గం గల వ్యక్తులు పాజిటివ్ లేదా నెగెటివ్ రక్తవర్గం గల ఎవరినుండైనా తీసుకోవచ్చు. కనుక O నెగెటివ్ రక్తాన్ని అందరూ తీసుకోవచ్చు. అందుకే దీనిని "విశ్వదాత" అని అంటారు.

5. "కాలేయం, అవటుగ్రంథి, లాలాజల గ్రంథి, జఠర గ్రంథి" లలో భిన్నమైనది ఏది? - (అవటుగ్రంథి)
వివరణ: అవటుగ్రంథి అంతఃస్రావక గ్రంథి, మిగిలినవి బాహ్య స్రావక గ్రంథులు.

6. బీటాకెరోటిన్ అనేది  ఒక....... (ప్రో విటమిన్)
వివరణ: విటమిన్ పూర్వ రూపాన్ని ప్రో విటమిన్ అంటారు. బీటాకెరోటిన్ అనేది  విటమిన్ - ఎ పూర్వ రూపం.

7. "నది, కొలను, సరస్సు" లలో లోటిక్ ఆవరణవ్యవస్థ ఏది? - (నది)
వివరణ: ప్రవహించే నీటిలో గల ఆవరణవ్యవస్థను లోటిక్ ఆవరణవ్యవస్థ అంటారు.

8. "మాస్టర్ గ్రంథి" అని దేనిని పిలుస్తారు? - (పీయూష గ్రంథి)
వివరణ: పీయూష లేదా పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్లు ఇతర అంతఃస్రావక గ్రంథులను నియంత్రిస్తాయి. కనుక దీనిని "మాస్టర్ గ్రంథి" అని పిలుస్తారు.

9. "కార్బన్ డై ఆక్సైడ్,  మీథేన్, సల్ఫర్ డై ఆక్సైడ్" లలో హరిత గృహవాయువు ఏది? - (పైవన్నీ)
వివరణ: కార్బన్ డై ఆక్సైడ్,  మీథేన్ లు ప్రత్యక్ష హరిత గృహవాయువులు. సల్ఫర్ డై ఆక్సైడ్ పరోక్ష హరిత గృహవాయువు.

10. "మస్క్యులర్ డిస్ట్రోఫి, సికిల్ సెల్ ఎనీమియా, పార్కిన్సన్స్" లలో ఏ వ్యాధికి జన్యుచికిత్స చేస్తారు? - (పైవన్నీ)
వివరణ: జన్యు లోపాల వలన కలిగే వ్యాధులకు జన్యు చికిత్స ఉపయోగపడుతుంది. లోపం ఉన్న జన్యువు స్థానంలో సరైన జన్యువును పంపి చికిత్స చేయడాన్ని "జన్యుచికిత్స" అంటారు. మస్క్యులర్ డిస్ట్రోఫి, సికిల్ సెల్ ఎనీమియా, పార్కిన్సన్స్ అనేవి జన్యు వ్యాధులే.

11. "వైరస్, బ్యాక్టీరియా, శిలింధ్రం, శైవలం" లలో దేనిని కాంతి సూక్ష్మదర్శిని సహాయంతో చూడలేం? - (వైరస్)
వివరణ: సూక్ష్మ జీవులన్నిటిలో వైరస్ చిన్నది. కనుక వైరస్ ను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడవచ్చు.

12. "టైఫాయిడ్, మలేరియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, కలరా" లలో భిన్నమైన వ్యాధిని గుర్తించండి? - (సిస్టిక్ ఫైబ్రోసిస్)
వివరణ: సిస్టిక్ ఫైబ్రోసిస్ జన్యు సంబంధిత వ్యాధి. మిగిలినవి సంక్రమిక లేదా అంటువ్యాధులు.

13. రక్తనాళాలు : యాంజియాలజి :: కాలేయం : ........ (హెపటాలజి)
వివరణ: యాంజియాలజి అనేది రక్తనాళాలను అధ్యయనం చేసే శాస్త్రం. అదే విధంగా కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రంను హెపటాలజి అంటారు.

14. మానవ శరీరంలోని "థర్మోస్టాట్" అని దేనిని పిలుస్తారు? - (హైపోథలామస్)
వివరణ: హైపోథలామస్ మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీనిని "థర్మోస్టాట్" అని పిలుస్తారు.

15. మానవ శరీరంలో "రక్తనిధి" అని దేనిని పేర్కొంటారు? - (ప్లీహం)
వివరణ: ప్లీహం రక్తకణాలను నిల్వ చేస్తుంది. కనుక దీనిని "రక్తనిధి" అని పిలుస్తారు.

16. "సిల్వర్ ఫిష్, డేవిల్ ఫిష్, జెల్లీ ఫిష్, డాగ్ ఫిష్" లలో నిజమైన చేప ఏది? - (డాగ్ ఫిష్)
వివరణ: సిల్వర్ ఫిష్ అనేది ఒక కీటకం. డేవిల్ ఫిష్ అంటే ఆక్టోఫస్, జెల్లీ ఫిష్ నిడేరియా వర్గానికి చెందిన ఒక అకశేరుక జంతువు.

17. "చేప, బల్లి, కప్ప, మానవుడు" లలో ఉష్ణ రక్త జంతువు? - (మానవుడు)
వివరణ: స్థిరమైన శరీర ఉష్ణోగ్రతలు కలిగిన  జంతువును ఉష్ణ రక్త జంతువు అంటారు. సాధారణంగా మానవుడు స్థిర శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంటాడు. చేప, బల్లి, కప్ప శీతలరక్త జీవులు. ఇవి పరిసరాలకు తగినట్లు తమ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి.

18. "మాంసం, కొవ్వు, పిండిపదార్థం, సెల్యులోజ్" లలో మానవుడు దేనిని జీర్ణం చేసుకోలేడు? - (సెల్యులోజ్)
వివరణ: సెల్యులోజ్ ను జీర్ణం చేసే "సెల్యులేజ్" అనే ఎంజైమ్ మానవ శరీరంలో ఉత్పత్తి కాదు. కనుక మానవుడు సెల్యులోజ్ నుజీర్ణం చేసుకోలేడు.

19. "జలగ, నల్లి, దోమ" లలో శాంగ్వివోరస్ జీవి ఏది? - (పైవన్నీ)
వివరణ: రక్తం పీల్చే జీవులను  శాంగ్వివోరస్ జీవులు అంటారు.

20. రెటినాల్ లోపాన్ని నివారించే జన్యుమార్పిడి మొక్క? - (గోల్డెన్ రైస్)
వివరణ: గోల్డెన్ రైస్ అనేది విటమిన్ - ఎ (రెటినాల్) తో ఫోర్టి పై చేసిన జన్యుమార్పిడి మొక్క.

21. పాలలో ఉండే ప్రోటీన్? - (కెసిన్)
వివరణ: పాలలో ఉండే చెక్కెర లాక్టోజ్. కెరాటిన్ అనేది చర్మం, వెంట్రుకలు, గోళ్ల లో ఉండే ప్రోటీన్. సుక్రోజ్ చెరకులో ఉండే చెక్కర. కనుక పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్.

22. "ఇన్సులిన్, పెప్సిన్, ప్రొజెస్టిరాన్" లలో ప్రోటీన్ హార్మోనుగా పనిచేసేది ఏది? - (ఇన్సులిన్)
వివరణ: ప్రొజెస్టిరాన్ అనేది హార్మోనుగా పనిచేసే కొవ్వు పదార్థం. పెప్సిన్ ఒక ఎంజైము. ఇన్సులిన్ హార్మోన్ ప్రోటీన్లతో ఏర్పడుతుంది.

23.  కాలేయం విధి కానిది ఏమిటి? - (నీటిలో కరిగే విటమిన్లను సంశ్లేషించి నిల్వ చేయడం)
వివరణ: కాలేయం కొవ్వుల్లో కరిగే విటమిన్లను సంశ్లేషించి నిల్వ చేస్తుంది.

24. "చేప, మానవుడు, బల్లి, కప్ప" లలో యూరికోటెలిక్ జీవి ఏది? - (బల్లి)
వివరణ: యూరికామ్లాన్ని విసర్జించే జంతువులను యూరికోటెలిక్ జీవులు అంటారు. బల్లి యూరికామ్లాన్ని విసర్జిస్తుంది.

25. "టీనియో ఫిల్లం, రఫ్లేషియా, ముల్లంగి, రైజోఫోరా" లలో ఏ మొక్క వేరు ఆకుపచ్చగా ఉంటుంది? - (టీనియో ఫిల్లం)
వివరణ: కిరణ జన్య సంయోగక్రియను జరపడం కోసం వేర్లు ఆకుపచ్చ రంగులోకి మారి రూపాంతరం చెంది ఉంటాయి .

26. "నాడీకణం, చర్మకణం, రక్త కణం, సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం" లలో ఏ కణంలో క్షయకరణ విభజన జరుగుతుంది? - (సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం)
వివరణ: లైంగిక కణాల్లో క్షయకరణ విభజన జరుగుతుంది. సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు క్షయకరణ విభజన చెంది పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి.

27. "మామిడి, సీతాఫలం, ఆపిల్, పైనాపిల్" లలో మిథ్యాఫలం ఏది?  - (ఆపిల్)
వివరణ: ఆపిల్ లో పుష్పాసనం ఫలం గా మారుతుంది. పుష్ఫంలోని ఇతర భాగాల నుంచి ఏర్పడిన ఫలాన్ని "మిథ్యాఫలం" అంటారు.

28. "కణ శక్త్యాగారం" అని ఏ కణాంగాన్ని పిలుస్తారు? - (మైటోకాండ్రియా)
వివరణ: మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ జరిగి గ్లూకోజ్ ఆక్సీకరణ చెంది శక్తిని విడుదల చేస్తుంది. కనుక మైటోకాండ్రియా ను "కణ శక్త్యాగారం" అంటారు.

29. సాధారణముగా ఫలం అనేది? - (ఫలదీకరణం చెందిన అండాశయం)
వివరణ: ఫలదీకరణం చెందిన అండాశయం ఫలంగానూ, అండాలు విత్తనాలుగాను మారతాయి.

30. "వైరస్, బ్యాక్టీరియా, శిలింద్రము" లలో దేనిని కృత్రిమ యానకం పై పెంచలేము? - (వైరస్)
వివరణ: వైరస్ జీవకణంలో మాత్రమే పెరుగుతుంది. వైరస్ ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం ఒక జీవకణం అవసరం.

No comments:

Post a Comment