Pages

Tuesday, July 24, 2018

GK - Competitive Exams Special - Chemistry

1. పరమాణు సంఖ్య "100" గా గల మూలకం ఏది? - (పెర్మియం)

2. పరమాణు సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? - (జాన్ డాల్టన్)

3. కాథోడ్ కిరణాలను  కనుగొన్న శాస్త్రవేత్త? - (జె. జె. థాంసన్)

4. ఫ్లోరోసెంట్ బల్బుల్లో ఏ వాయువును నింపుతారు? - (నియాన్)

5. విమానాలు నడిపే పైలెట్లకు దారి చూపే దీపాల్లో నింపే వాయువు? - (నియాన్)

6. Alloys వెల్డింగ్ చేసేటప్పుడు జడవాతావరణం కలుగజేయడానికి ఏ వాయువును వాడతారు?  - (ఆర్గాన్)

7. కెమెరాలోని ఫ్లాష్ లైట్లలో ఏ వాయువును నింపుతారు? - (క్రిప్టాన్)

8. ఫిల్మ్ ప్రొజెక్టర్, ఆటోమొబైల్, హ్యాండ్ లాంప్ లలో ఏ వాయువును వాడతారు?  - (గ్జినాన్)

9. ఐసోటోప్ లలో న్యూట్రాన్లను గుర్తించడానికి దేనిని వాడతారు?  - (గ్జినాన్)

10. ఘనరూపం లో ఉండే హాలోజన్ ఏది? - (అయోడిన్)

11. ఆవర్తన పట్టికలో ఎక్కువ శాతం మూలకాలు వేటికి సంబంధించినవి? - (లోహాలు)

12. మొదటి క్షార లోహం ఏది? - (లిథియం)

13. మానవుడు తయారు చేసిన కృత్రిమ లోహం ఏది? - (టెక్నీషియం)

14. ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో న్యూట్రాన్ ఉండని ఒకే ఒక మూలకం? - (హైడ్రోజన్)

15. పరమాణు కేంద్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? - (రూథర్ ఫర్డ్)

16. కిరోసిన్ లో నిల్వ చేసే లోహం? - (సోడియం)

17. చంద్రుని ఉపరితలం మట్టిలో ఉండే లోహం? - (టైటానియం)

18. చాకెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. ఇందుకు అందులోని ఏ లోహం కారణం?  - (నికెల్)

19. మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం? - (మాంగనీస్)

20. పాము కాటుకు గురైనప్పుడు మానవ శరీరంలోకి ప్రవేశించే లోహం? - (ఆర్సినిక్)

21. మానవుడి ఎముకలు, దంతాల్లో ఉండే సమ్మేళనం? - (కాల్షియం ఫాస్ఫేట్)

22. దుస్తులు శుభ్రం చేయడానికి ఉపయోగించే సబ్బుల్లో ఉండే సమ్మేళనం? - (ట్రై ఇథనాల్ అమ్మోనియం)

23. సబ్బుల తయారీలో పారదర్శకత కోసం కలిపే రసాయనం?  - (గ్లిసరాల్)

24. దుర్వాసనను నివారించే సబ్బుల్లో ఉండే రసాయనాలు? - (ట్రై బ్రోమో సాలిసిలానిలైడ్)

25. భూమి పొరల్లో అధికంగా లభించే లోహం? - (అల్యూమినియం)

26. పశువుల వీర్యాన్ని దేనిలో నిల్వ చేస్తారు? - (ద్రవ నైట్రోజన్)

27. క్వార్ట్జ్ లో ఏ మూలకాలు ఉంటాయి? - (సిలికాన్, ఆక్సిజన్)

28. నాన్ స్టిక్ పాత్రలపై ఏ పూత పూస్తారు? - (టెఫ్లాన్)

29. ఆడియో క్యాసెట్ల పై ఏ పూత పూస్తారు? - (ఫెర్రిక్ ఆక్సైడ్)

30. గన్ మెటల్ లో ఉండే లోహం? - (కాపర్)

31. షేవింగ్ క్రీముల్లో నురగ కోసం వాడే రసాయన పదార్థం? - (పొటాషియం స్టియరేట్)

32. గన్ పౌడర్ తయారీలో ఉండే మూలకం? - (సల్ఫర్)

33. కల్తీ కల్లులో నురగ కోసం వాడే రసాయనం? - (క్లోరల్ హైడ్రేట్)

34. సల్ఫర్ రూపాంతరాల్లో అత్యంత స్థిరమైనది? - (రాంబిక్ సల్ఫర్)

35. కుళ్లిన కోడిగుడ్డు వాసన కలిగిన వాయువు? - (హైడ్రోజన్ సల్ఫైడ్)

36. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం? - (ఫ్లోరిన్)

37. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటి గల మూలకం? - (క్లోరిన్)

38. అత్యంత తేలికైన లోహం ఏది? - (లిథియం)

39. భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? - (యూరే)

40. ఏ ఉష్ణోగ్రత వద్ద దుక్క ఇనుము లేదా పోత ఇనుము ఏర్పడుతుంది? - (1600℃)

41. ఇనుము పెళుసుదనం దేనిపై ఆధారపడి ఉంటుంది?  - (కార్బన్)

42. అగ్గిపుల్ల మండటానికి కావాల్సిన ఆక్సిజన్ ఏ రసాయనం నుంచి లభిస్తుంది? - (పొటాషియం క్లోరైడ్)

43. కోహినూర్ వజ్రం ఎన్ని క్యారెట్లు ఉంటుంది? - (186)

44. లిక్విడ్ గోల్డ్ అని దేనిని పిలుస్తారు? - (పెట్రోలియం)

45. సిమెంట్ ను కనుగొన్నవారు? - (జె. ఎస్ఫిడిన్)

46. ప్రయోగశాల పరికరాలు తయారుచేయడానికి ఏ రకమైన గాజును వాడతారు? - (బూరోసిల్)

47. కళ్ళద్దాల తయారీలో వాడే గాజు? - (క్రౌన్)

48. మిశ్రమ లోహాలను మొదటిసారిగా తయారుచేసిన శాస్త్రవేత్త? - (హెన్నీ బెసిమర్)

No comments:

Post a Comment