Pages

Friday, June 29, 2018

General Studies - Physics

1. మెరుపు కనిపించిన తర్వాతే ఉరుము శబ్దం వినిపిస్తుంది. కారణం?  - (ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ)

2. సరస్సు నీటిలోతు, ఉన్నదాని కంటే తక్కువగా కనిపిస్తుంది. కారణం? - (కాంతి వక్రీభవనం)

3. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణమైన కాంతిధర్మం? - (కాంతి పరిక్షేపణం)

4. ఉపగ్రహంలో ప్రయాణిస్తున్న వ్యోమగామికి భూమి ఏ రంగులో కనిపిస్తుంది? - (నలుపు)

5. లఘు లోలకం పొడవు రెండు శాతం పెరిగితే, సమయం ......... ? - (4 శాతం పెరుగుతుంది)

6. ఒక దుప్పటి కంటే రెండు దుప్పట్లు కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. కారణం? - (వాటి మధ్య ఏర్పడిన గాలిపొర అథమ ఉష్ణ వాహకంగా పని చేస్తుంది)

7. ఒక వస్తువు ద్రవ్యరాశి అంటే? - (ఆ వస్తువులో ఉన్న మొత్తం పదార్థ పరిమాణం)

8. మృతదేహం నీటిమీద తేలుతుంది. ఎందుకు? - (మృతదేహం స్థానభ్రంశం చేసిన నీటిబరువు, మృతదేహం బరువు కంటే ఎక్కవ)

9. వానచినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం? - (తలతన్యత)

10. ఒక అశ్వ సామర్థ్యం? - (746 వాట్స్)

11. జలాతర్గామిలో నిట్టనిలువుగా అమర్చిన పెరిస్కోప్ లో రెండు సమతల దర్పణాల మధ్య ఉండే కోణం? - (0°)

12. అగ్నిమాపక దళ సభ్యుడి హెల్మెట్ ను బాగా పాలిష్ చేయడానికి కారణం? - (అగ్ని వల్ల వచ్చే ఉష్ణం పరావర్తనం చెందడానికి)

13. సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం? - (హైగ్రోమీటర్)

14. సూర్యకాంతి భూమిని చేరే సమయం? - (497 సెకన్లు)

15. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి అనువైన లోహం? - (నికెల్)

16. భూమధ్య రేఖ "g" వద్ద విలువ? - (కనిష్టం)

17. ఉష్ణం "SI" ప్రమాణం? - (కెలోరీ)

18. కంటి ఘటం (photo Cell) అంటే? - (కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం)

19. విద్యుత్ హీటర్ లో ఉండే ఎలిమెంట్ ను దేనితో తయారు చేస్తారు? - (నిక్రోమ్)

20. క్రికెట్ ఆటగాడు వేగంగా వస్తున్న బంతిని పట్టుకునే క్రమంలో చేతులను వెనక్కి తీసుకోవడానికి కారణమైన నియమం? - (ప్రచోదనం)

21. ధ్వని అనేది ఒకరకమైన .........? - (యాంత్రిక శక్తి)

22. వృద్ధుల శ్రావ్య అవధి? - (10 H𝑧 - 12,000 H𝑧)

23. పీడనం పెరిగే కొద్దీ ధ్వని వేగం? - (మారదు)

24. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎరుపు రంగు వాడటానికి కారణం? - (ఎరుపు రంగు తరంగధైర్ఘ్యం ఎక్కువ)

25. అయస్కాంతంలో అధికమైన అయస్కాంతత్వం ఎక్కడ ఉంటుంది? - (అంచుల సమీపంలో)

26. భూమికి ఉన్న కవల గ్రహం? - (గురు)

27. సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? - (ఐన్ స్టీన్)

28. ఇనుము తుప్పు పట్టకుండా ఉండటానికి దేనితో గాల్వనైజేషన్ చేస్తారు? - (జింక్)

29. రిఫ్రిజిరేటర్ లో థర్మోస్టాట్ చేసే పని?  -(స్థిరమైన ఉష్ణోగ్రతల నిర్వహణ)

30. సాధారణంగా ట్రాన్సిస్టర్లలో ఉండేది? - (జర్మేనియం)

31. బాగా పొడిగా ఉన్న జుట్టును దువ్విన దువ్వెనను చిన్న చిన్న కాగితం ముక్కలకు సమీపంలో ఉంచితే అది కాగితాలను తన వైపు ఆకర్షిచుకుంటుంది. దానికి కారణం? - (వాటి మధ్య విద్యుత్ ఆకర్షణ)

32. ట్రాన్స్ ఫార్మర్ ఉపయోగం? - (A.C ఓల్టేజిని పెంచడానికి)

33. గాలి వేగాన్ని, దిశను కొలవడానికి ఉపయోగించే పరికరం? - (అనిమో మీటర్)

34. లౌడ్ స్పీకర్ అనేవి? - (విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది)

35. న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడే పదార్ధం? - (భారజలం)

36. అధిక పౌనఃపున్యం కలిగిన కిరణాలు? - (గామా)

37. ఏదైనా బయటి బలం పనిచేస్తున్నప్పుడు తప్ప, సాధారణంగా ఒక వస్తువు వేగం స్థిరముగా ఉండే లక్షణం? - (జడత్వం)

38. రేఖీయ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం శక్తి? - (గతి & స్థితి శక్తి)

39. ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం?  -(పుటాకార)

40. విద్యుత్ సర్క్యూట్ లలో ఉపయోగించే ఫ్యూజ్ వైర్ తయారీ లోహం లక్షణం? - (అల్ప ద్రవీభవన స్థానం గల లోహం)

41. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం? - (పాదరసం)

42. చలిస్తున్న విద్యుత్ ఆవేశం ఏర్పరిచే క్షేత్రం? - (అయస్కాంత & గురుత్వ క్షేత్రం)

43. వజ్రానికి చెందిన ధర్మాల్లో  క్యారెట్లలో కొలిచే ధర్మం? - (స్వచ్ఛత)

44. గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు? - (ఇసుక, సున్నపురాయి, సోడా యాష్)

45. పుట్లర్స్ ఎర్త్ అనేది దేని పేరు?  -(ఖనిజం)

46. భూ ఉపరితలం నుంచి పలాయన వేగం దాదాపుగా? - (11. 2 km/ sec)

47. కాంతి తరంగాలు ........ ? - (విద్యుదయస్కాంత తరంగాలు)

48. అనిశ్చితత్వ నియమాన్ని ప్రతిపాదించింది? - (హైసెన్ బర్గ్)

49. దూరదృష్టి లోపం ఉన్న వ్యక్తి ఉపయోగించే కటకం?  - (ద్వికుంభాకార)

50. హైడ్రోజన్ బాంబుకు ఆధారం? - (కేంద్రక సంలీనం)

51. కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఒక వస్తువును కిందికి విసిరితే అది అనుసరించే మార్గం? - (పరావలయ మార్గం)

52. చిలికినప్పుడు పాల నుంచి వెన్న వేరుకావడానికి కారణం?  - (అపకేంద్ర బలం)

53. నీటి గరిష్ట సాంద్రత? - (4 ℃ వద్ద)

No comments:

Post a Comment