పోటీ పరీక్షల ప్రత్యేకం - జనరల్ సైన్స్ # 3
1. ఎలక్ట్రిక్ ఐరన్ (ఇస్త్రీ పెట్టె) లోని హీటింగ్ ఎలిమెంట్స్ దేనితో తయారు చేస్తారు? - (నైక్రోమ్)
2. ఇనుప గొట్టాలపై తుప్పు రాకుండా జింక్ పొర పూస్తారు. దీనిని ఏమంటారు? - (గాల్వనైజింగ్)
3. యురేనియం, కేంద్రక విచ్చేదనం దేనితో ప్రారంభం అవుతుంది? - (న్యూట్రాన్)
4. పెట్రోల్ యాంటినాకింగ్ లక్షణం దేని వలన వస్తుంది? - (న్యూట్రాన్)
5. నైట్రోజన్ ఎరువుల తయారీకి కావలసింది ఏమిటి? - (అమ్మోనియా)
6. రక్తంలో ప్లాస్మా లా పనికొచ్చే 'పాలిమర్' ఏది? - (పాలి(వినైల్ పైరోలిడోన్)-----> దీనిని 2వ ప్రపంచ యుద్ధ కాలంలో గాయపడిన సైనికుల కోసం విజయవంతంగా ఉపయోగించారు)
7. నేచురల్ రబ్బర్ ని, రబ్బర్ చెట్ల పాలనుంచి తయారు చేస్తారు. రబ్బర్ చెట్ల పాలను లేటెక్స్ అంటారు. లేటెక్స్ లో ఏమి ఉంటుంది? - (30 - 40% రబ్బర్, 60 - 70% నీరు, లిపిడ్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కార్బనేతర పదార్థాలు)
8. వేటిని ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అంటారు? - (నైలాన్, పాలి కార్బోనేట్స్, పాలీ సల్ఫోన్, పాలి ఫార్మాల్డిహైడ్. ఇవి ఎంత వేడినైనా తట్టుకొంటాయి. దృఢంగా ఉంటాయి. రసాయనిక, వాతావరణ మార్పులను తట్టుకొంటాయి.)
9. రబ్బర్ బాల్ గ్లాస్ ట్రాన్షిషన్ ఉష్ణోగ్రత ఎంత? - (-78℃ వద్ద ఆర్డినరీ రబ్బర్ బాల్ గట్టి పడిపోయి గాజు మాదిరిగా ముక్కలు ముక్కలుగా పడిపోతుంది.)
10. నైలాన్ కనుగొన్నదెవరు? - (W.H.కారోథర్స్)
11. బుల్లెట్ ప్రూఫ్ పదార్థాలు/ వస్త్రాల తయారీకి ఉపయోగించే పాలిమర్ ఏది? - (పాలికార్బొనేట్స్. ఇవి ఫెనాల్ పాలిస్టర్స్ అండ్ కార్బొనిక్ యాసిడ్స్)
12. టెర్లిన్ అనే పాలిస్టర్ దేనితో తయారుచేస్తారు? - (ఎథిలీన్ గ్లైకాల్ అండ్ టెరాప్థాలిక్ యాసిడ్)
13. పిసిసైడ్ దేనిని చంపడానికి వాడతారు? - (చేపల్ని)
14. జీన్ థెరపీతో నయం చేసిన లోపం ఏది? - (ఎడినోసైన్ డియామినేస్ డెఫిసియన్షి)
15. ములస్కీసైడ్ దేనిని చంపడానికి ఉపయోగిస్తారు? - (నత్తల్ని)
No comments:
Post a Comment