బహుళైశ్చిక ప్రశ్నలు - జీవ పరిణామం
1. బయోజెనిసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చింది?
ఎ) ఛార్లెస్ డార్విన్ బి) లామార్క్ సి) ఒపారిన్ డి) లూయీ పాశ్చర్ (డి)
2. మనిషి ఆవిర్భావం కింది ఏ ప్రాంతాల్లో ప్రారంభమైంది?
ఎ) ఆసియా బి) ఆఫ్రికా సి) యూరోప్ డి) అమెరికా (బి)
3. ఏ మహాయుగాన్ని సరీసృపాల స్వర్ణ యుగం అంటారు ?
ఎ) పేలియో జాయిక్ బి) మీసో జాయిక్ సి) సీనో జాయిక్ డి) ప్రొటెరో జాయిక్ (బి)
4. భూమ్మీద ఎన్ని మిలియన్ల ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించింది?
ఎ) 3500 బి) 4500 సి) 6000 డి) ఏదీ కాదు (ఎ)
5. కింది వాటిలో ఏ జంతువు మనిషికి అత్యంత సమీప బంధువు ?
ఎ) చింపాంజీ బి) కోతి సి) గొరిల్లా డి) గిబ్బన్ (ఎ)
6. భూమ్మీద ఏర్పడిన మొట్టమొదటి పూర్వ కణాలు?
ఎ) ప్రొటినాయిడ్లు బి) ప్రోటోబియాంట్లు సి) ఇయోబియాంట్లు డి) కొయసర్వేట్లు (డి)
7. భూమి వాతావరణంలోని స్ట్రాటో స్పియర్ లో ఓజోనుపొర ఏర్పడటానికి కారణమైన సౌర వికిరణం?
ఎ) పరారుణ కిరణాలు బి) దృగ్గోచర కాంతి
సి) అతినీలలోహిత కిరణాలు డి) సూక్ష్మ తరంగాలు (సి)
8. భూమి అంతర్భాగం (core)లో ఏ రెండు మూలకాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్నాయి ?
ఎ) సోడియం, పొటాషియం బి) ఇనుము, నికిల్
సి) రాగి, తగరం డి) సోడియం, లిథియం (బి)
9. పూర్వం భూమి వాతావరణంలో లేని వాయువు ?
ఎ) అమోనియా బి) మీథేన్ సి) హైడ్రోజన్ సయనైడ్ డి) కార్బన్ డై ఆక్సైడ్ (డి)
10. భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలను నియంత్రించే ముఖ్యమైన వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) కార్బన్ డై ఆక్సైడ్ సి) హైడ్రోజన్ డి) నైట్రోజన్ (బి)
No comments:
Post a Comment