పోటీపరీక్షల ప్రత్యేకం - రక్తం- రక్త వర్గాలు
1. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
జ. హెమటాలజీ (Haematology)
2. ద్రవరూప కణజాలం అని దేనినంటారు ?
జ. రక్తం
3. రక్తంలోని కణాంతర ద్రవాన్ని ఏమంటారు ?
జ. ప్లాస్మా
4. రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి ఉపయోగించే ద్రావణాలు ?
జ. సోడియం ఆక్సలేట్ లేదా సోడియం సిట్రేట్
5. 0.9 శాతం సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఏమంటారు ?
జ. సెలైన్
6. రక్తం గడ్డ కట్టకుండా సేకరించే ద్రవపదార్థాన్ని ఏమంటారు ?
జ. ప్లాస్మా
7. రక్తాన్ని గడ్డ కట్టించిన తర్వాత సేకరించే పదార్థం ?
జ. సీరమ్
8. రక్త పరిమాణంలో ప్లాస్మా శాతం?
జ. 60%
9. ప్లాస్మాలో నీటి శాతం?
జ. 85 - 90 %
10. ప్లాస్మాలో ముఖ్యమైన అకర్బన పదార్థాలు ?
జ. సోడియం క్లోరైడ్స్, బైకార్బొనేట్స్
11. ప్లాస్మాలో లవణాల శాతం?
జ. 0.85 నుంచి 0.9 %
12. ప్లాస్మాలో ఎంత శాతం కర్బన పదార్థాలుంటాయి?
జ. 6 నుంచి 8 శాతం
13. ప్లాస్మాలో ఉన్న కర్బన పదార్థాలు ?
జ. చక్కెరలు, అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు, యూరియా, లిపిడ్లు, ప్రొటీన్లు,
14. రక్తంను రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా చేసే పదార్థం?
జ. హిపారిన్
15. ప్లాస్మాలో ఉండే ప్రొటీనులు ?
జ. ఆల్ట్యుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్
16. ప్లాస్మాలో అతిముఖ్యమైన ప్రొటీన్ ?
జ. ఆల్ట్యుమిన్
17. రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడే ప్రొటీనులు ?
జ. ఫైబ్రినోజిన్, ప్రోత్రాంబిన్
18. ఓ మిల్లీ లీటరు రక్తంలో ఉండే ఎర్రరక్తకణాల సంఖ్య?
జ. 4.5 - 5.5 X 10⁶
19. ఎర్రరక్తకణాల్లో కేంద్రకం కలిగిన జీవులు ?
జ. ఒంటె, లామా
20. పెద్దవారిలో ఎర్రరక్తకణాలు ఎక్కడ ఏర్పడుతాయి ?
జ. అస్థి మజ్జలో
21. చిన్నవారిలో ఎర్రరక్తకణాలు ఎక్కడ ఏర్పడుతాయి?
జ. కాలేయం, ప్లీహం
22. ఎర్రరక్తకణాల ఉత్పత్తి?
జ. ఎరిత్రోపాయిసిస్
23. ఎర్రరక్త కణాల జీవిత కాలం?
జ. 120 రోజులు
24. ఎక్కువగా ఎర్రరక్తకణాలు దేనిలో విచ్ఛిన్నమవుతాయి?
జ. ప్లీహంలో
25. ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అని దేనినంటారు?
జ. ప్లీహం
26. ప్రతిరోజు విచ్చిన్నమయ్యే ఎర్ర రక్తకణాల సంఖ్య ?
జ. 10 x10¹²
27. హీమోగ్లోబిన్లో ఉండే ప్రొటీను ?
జ. గ్లోబిన్
28. హీమోగ్లోబిన్లో ఉన్న కర్బన పరమాణువు ?
జ. ఫోర్ ఫిరిన్
29. ఓ మిల్లీ లీటరు రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల సంఖ్య?
జ. 5 - 9 x 10³
30. తెల్ల రక్తకణాలు ఏర్పడే ప్రదేశం?
జ. లింఫ్ కణుపులు, ప్లీహం, థైమస్ గ్రంధి
31. తెల్ల రక్త కణాల జీవిత కాలం?
జ. 12 - 13 రోజులు
32. భక్షక కణాలు అని ఏ కణాలను అంటారు ?
జ. తెల్ల రక్తకణాలు
33. తెల్ల రక్తకణాలు ఎన్ని రకాలు? అవి ఏవి ?
జ. 2 రకాలు 1) గ్రాన్యులోసైట్స్ 2) ఎగ్రాన్యులోసైట్స్
34. గ్రాన్యులో సైట్ రకాలు ?
జ. 1) ఎసిడోఫిల్స్ 2) బేసోఫిల్స్ - 3) న్యూట్రోఫిల్స్
35. ఎగ్రాన్యులో సైట్ ల రకాలు ?
జ. 1) లింఫోసైట్స్ 2) మోనోసైట్స్
36. ఆమ్ల రంజకాల్లో రంగును సంతరించుకునే గ్రాన్యులోసైట్సను ఏమంటారు ?
జ. ఎసిడోఫిల్స్
37. పరాన్న జీవులను ప్రతిఘటించి, ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించే కణం?
జ. ఎసిడోఫిల్స్
38. రెండు తమ్మెల కేంద్రకం ఉన్న రక్తకణం ?
జ. ఎసిడోఫిల్స్
39. క్షార రంజకాలతో రంగును సంతరించుకునే కణాలు?
జ. బేసోఫిల్స్
40. 'ఎస్' ఆకార కేంద్రకం ఉన్న రక్త కణం?
జ. బేసోఫిల్స్
41. గాయాలు మానడంలో సహాయపడే రక్త కణం?
జ. బేసోఫిల్
42. తటస్థ రంజకాలతో రంగును సంతరించుకునే రక్తకణం?
జ. న్యూట్రోఫిల్స్
43. కేంద్రకానికి 5 లేదా 6 తమ్మెలున్న రక్తకణం?
జ. న్యూట్రోఫిల్స్
44. జీవ పదార్థంలో బాక్టీరియాల సంహరణ దేనిలో జరుగుతుంది?
జ. న్యూట్రోఫిల్స్
45. శరీరానికి మొదటి వరుస రక్షక భటులు అని వేటినంటారు ?
జ. న్యూట్రోఫిల్స్
46. తెల్ల రక్తకణాల్లో అతి చిన్న కణాలు ?
జ. లింఫోసైట్స్
47. ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్తకణాలు?
జ. లింఫోసైట్స్
48. గుండ్రంగా ఉండి, పెద్ద కేంద్రకం ఉన్న రక్త కణం?
జ. లింఫోసైట్
49. తెల్ల రక్తకణాల్లో అతి పెద్ద కణం?
జ. మోనోసైట్
50. మూత్ర పిండాకారంలో కేంద్రకం ఉన్న రక్త కణం?
జ. మోనో సైట్ (Monocyte)
51. వ్యాధులను నయం చేయడంలో తోడ్పడే రక్తకణం?
జ. Monocyte
52. రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖపాత్ర వహించే రక్త కణాలు ?
జ. రక్త ఫలకికలు
53. ఓ వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి అతని సిరల ద్వారా ఎక్కించడాన్ని ఏమంటారు ?
జ. రక్త ప్రవేశనం
54. రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ?
జ. కారల్ లాండ్ స్టీనర్ (1900 )
55. రక్త కణాలు గుంపులుగా ఏర్పడడాన్ని ఏమంటారు?
జ. రక్త గుచ్చకరణం
56. ప్రతి జనకాలు దేని మీద ఉంటాయి ?
జ. ఎర్ర రక్తకణాలు
57. ప్రతి రక్షకాలు దేనిలో ఉంటాయి?
జ. ప్లాస్మాలో
58. ఎర్రరక్త కణాల మీద ఉండే ప్రతిజనకాలు ?
జ. ప్రతి జనకం-A, ప్రతి జనకం-B
59. ప్లాస్మాలో ఉండే ప్రతి రక్షకాలు ?
జ. ప్రతి రక్షకం-A, ప్రతి రక్షకం-B
60. మానవుడిలో రక్త వర్గాల రకాలు ?
జ. 4. అవి A, B, AB, O
61. A రక్త వర్గం వ్యక్తుల ఎర్ర రక్తకణాల మీద ఉండే ప్రతి జనకం?
జ. ప్రతిజనకం A
62. 'B' రక్తవర్గం వ్యక్తుల ఎర్ర రక్తకణాల మీద ఉండే ప్రతి జనకం?
జ. ప్రతిజనకం B
63. ప్రతి రక్షకం 'B' ఉన్న రక్త వర్గం?
జ. A
64. ప్రతిరక్షకం 'A' ఉన్న రక్త వర్గం?
జ. B
65. ప్రతి రక్షకాలు A,B లు రెండూ లేని రక్తవర్గం?
జ. AB
66. ప్రతి జనకాలు A, B లు రెండూ లేని రక్తవర్గం ?
జ. O రక్త వర్గం
67. ప్రతి జనకం A,B లు రెండూ ఉండే రక్త వర్గం?
జ. AB
68. ప్రతి రక్షకం A, B లు రెండూ ఉండే రక్త వర్గం?
జ. O
69. విశ్వదాత అని ఏ రక్త గ్రూపు వ్యక్తులను అంటారు ?
జ. O
70. విశ్వగ్రహీత అని ఏ రక్తగ్రూపు వ్యక్తులను అంటారు ?
జ. AB
71. ఓ వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు ?
జ. సిర ద్వారా
72. రక్త గుచ్ఛకరణానికి కారణమైన చర్య?
జ. ప్రతి జనకం -ప్రతి రక్షకాల మధ్య చర్య
73. మన దేశంలో Rh+ రక్తం ఉన్న వారి శాతం?
జ. 93%
74. దాతల నుంచి గ్రహించిన రక్తాన్ని నిలువచేసే కేంద్రాలను ఏమంటారు ?
జ. రక్త సేకరణ కేంద్రాలు (Blood Banks)
75. ఏ వయసులో వారు రక్త దానం చేయవచ్చు?
జ. 16-60 సంవత్సరాలు
76. A రక్త వర్గం వ్యక్తికి సరిపోయే రక్త వర్గం?
జ. A and O
77. B రక్త వర్గం వ్యక్తికి సరిపోయే రక్త వర్గం?
జ. B and O
78. AB రక్త వర్గం వ్యక్తికి సరిపోయే రక్త వర్గం?
జ. A, B, AB and O
79. O రక్త వర్గం వ్యక్తికి సరిపోయే రక్త వర్గం?
జ. O మాత్రమే
No comments:
Post a Comment