Pages

Tuesday, November 9, 2021

పోటీపరీక్షల ప్రత్యేకం - జంతువుల్లో మరియు మానవునిలో రవాణా వ్యవస్థ

 పోటీపరీక్షల ప్రత్యేకం - జంతువుల్లో మరియు మానవునిలో  రవాణా వ్యవస్థ 

1. ఆహార పదార్థాల రవాణా, ఆక్సిజన్ రవాణా, హార్మోన్ రవాణాకు అవసరమైన వ్యవస్థ ?

 జ. రవాణా వ్యవస్థ 

2. జీవ పదార్థంలో ఉండే నీటి శాతం?

జ. 80 %

3. అమీబా వంటి ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా వేటి వల్ల జరుగుతుంది? 

జ. విసరణ లేదా జీవ పదార్థ చలనం వల్ల 

4. పదార్థాల రవాణాకు బహుకణ జీవులు రూపొందించుకున్న ప్రత్యేక ద్రవాలు ?

 జ. రక్తం, శోషరసం 

5. రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు? 

జ. గుండె, రక్తం, రక్త నాళాలు

 6. రక్తం తెల్ల రంగులో ఉండే జంతువులు ?

 జ. బొద్దింక,గొల్లభామ 

7. ఏ జంతువుల్లో  రక్తం నీలం రంగులో  ఉంటుంది?

 జ. పీత, నత్త

 8. వానపాము, కప్పలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో రక్తం ఏరంగులో ఉంటుంది? 

జ. ఎర్రగా 

9. ఎర్రరక్త కణాలు లేని జీవి ? 

జ. వానపాము

 10. రక్తనాళాలు లేని జీవులు ? 

జ. కీటకాలు, మొలస్కా జీవులు

11. బొద్దింక హృదయంలోని గదుల సంఖ్య?

 జ. 13

 12. వానపాములో హృదయాల సంఖ్య?

 జ. 8 జతలు(16)

 13. రక్తం శరీర కుహరంలోని కోటరాలలో ప్రవహించే రక్త ప్రసరణను ఏమంటారు ? 

జ. స్వేఛ్చాయుత రక్త ప్రసరణ వ్యవస్థ 

14. హృదయం రక్తాన్ని రక్తనాళాల ద్వారా సరఫరా చేసే రక్త ప్రసరణని ఏమంటారు ? 

జ. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ

 15. వానపాము శాస్త్రీయ నామం? 

జ. మెగా స్కోలెక్స్ 

16. వానపాములో ఆహారనాళానికి పైన ఉండే రక్త నాళం? 

జ. పృష్ఠ రక్తనాళం

17. వానపాములో ఆహార నాళానికి కింద ఉండే రక్త నాళం ? 

జ. ఉదర రక్త నాళం

 18. వానపాములో రక్తాన్ని సేకరించే రక్త నాళం?

 జ. పృష్ఠ రక్త నాళం 

19. వానపాములో రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళం? 

జ. ఉదర రక్త నాళం 

20. వానపాము శరీరంలో ముఖ్య సిరగా పనిచేసే రక్త నాళం?

 జ. పృష్ఠ రక్తనాళం 

21. వానపాము శరీరంలో ముఖ్య ధమనిగా పనిచేసే రక్తనాళం ?

 జ. ఉదర రక్తనాళం

 22. పృష్ఠ రక్తనాళంలో రక్తం ఏమార్గంలో ప్రసరిస్తుంది? 

జ. వెనుక నుంచి ముందుకు

23. ఉదర రక్త నాళంలో రక్తం ఏ మార్గంలో ప్రసరిస్తుంది ? 

జ. ముందు నుంచి వెనుకకు

 24. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవికి ఉదాహరణ ? 

జ. బొద్దింక, సీతాకోక చిలుక 

25. పక్షాకార కండరాలున్న జంతువు ? 

జ. బొద్దింక

 26. బొద్దింక శరీరం ఎన్ని కోటరాలుగా విభజించి ఉంటుంది? అవి ఏవి? 

జ. 3 కోటరాలు; 1.హృదయావరణ కోటరం 2.పర్యాంతరాంగ కోటరం 3.ఉదర కోటరం 

27. బొద్దింక హృదయం ఉండే కోటరం? 

జ. హృదయావరణ కోటరం 

28. హృదయ గదుల పార్శ్వకుడ్యంలో ఉండే రంధ్రాలు ? 

జ. కుల్యాముఖాలు

 29. పక్షాకార కండరాల ఆకారం ? 

జ. విసన కర్ర 

30. పక్షాకార కండరాలు సంకోచం చెందినప్పుడు రక్తం శరీర కుహరం నుంచి దేనిలోకి 

ప్రవేశిస్తుంది ? 

జ. హృదయావరణ కుహరంలోకి

 31.  పక్షాకార  కండరాలు సడలినప్పుడు రక్తం హృదయావరణ కుహరం నుంచి దేనిలోకి ప్రవేశిస్తుంది?

 జ. హృదయంలోకి 

32. సిరాసరణి ఉండని జంతువులు ? 

జ. పక్షులు, క్షీరదాలు

 38. బొద్దింకలో రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడేవి ? 

జ. పక్షాకార కండరాలు

 34. బొద్దింక తలలో ఉండే కోటరాన్ని ఏమంటారు ? 

జ. శిరఃకోటరం

35. ఉభయ జీవుల్లో సిరాసరణి వేటి ద్వారా ఏర్పడుతుంది ?

 జ. మహసిరల కలయిక వల్ల 

36. చేప హృదయంలో గదుల సంఖ్య?

జ. 2

37. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక ఉన్న జంతువుకు ఉదాహరణ? 

జ. తొండ, పాము

 38. ఉభయ జీవుల్లో మహసిరలు కలిసి ఏర్పడేది ?

జ. సిరాసరణి

39. చేపల్లో ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజనీకరణం చెందే ప్రదేశం? 

జ. మొప్పలు 

40. చేపల్లో ఉండే రక్త ప్రసరణను ఏమంటారు ?

 జ. ఏకవలయ రక్తప్రసరణ 

41. ద్వివలయ ప్రసరణ జరిగే జంతువులకు ఉదాహరణ ?

 జ. కప్ప, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు

42. మానవ హృదయాన్ని రక్షించే ఎముకల నిర్మాణాలు ?

 జ. పక్కటెముకల పంజరం, వెన్నెముక 

43. మానవ హృదయ పరిమాణం? 

జ. వ్యక్తి పిడికిలితో సమానం

44. మానవ హృదయం ఏ కండరంతో నిర్మితమై ఉంటుంది ?

 జ. హృదయ కండరం

 45. హృదయం చుట్టూ ఉన్న రెండు పొరలను ఏమంటారు ? 

జ. హృదయావరణం

46. హృదయావరణ పొరల మధ్య ద్రవాన్ని ఏమంటారు? 

జ. హృదయావరణ ద్రవం

47. రెండు పొరల మధ్య కుహరాన్నేమంటారు ?

 జ. హృదయావరణ కుహరం 

48. హృదయానికి రక్తాన్ని తీసుకొచ్చే అతి పెద్ద సిరలను ఏమంటారు ? 

జ. మహా సిరలు లేదా బృహత్సిరలు 

49. హృదయం నుంచి రక్తాన్ని తీసుకొని పోయే అతి పెద్ద ధమనులను ఏమంటారు ? 

జ. మహా ధమనులు 

50. సిరల్లో ప్రవహించు రక్తం?

 జ. ఆమ్లజని రహిత రక్తం

 51. పుపుస సిరల్లో ప్రవహించే రక్తం?

 జ. ఆమ్లజని సహిత రక్తం 

52. శరీర పై భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరించే రక్తనాళం?

 జ. పూర్వ లేదా ఊర్ధ్వ మహాసిర 

53. శరీర దిగువ భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరించే రక్తనాళం? 

జ. పర లేదా అధోమహాసిర 

54. ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరించే రక్త నాళం?

జ. పుపుససిర

55. ఎడమ జఠరిక నుంచి బయలు దేరి ఊపిరితిత్తులకు తప్ప శరీరంలోని అన్ని భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని పంపిణీ చేసే రక్త నాళం?

జ. దైహిక ధమని

56. కుడి జఠరిక నుంచి బయలుదేరి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం?

జ. పుపుస ధమని

57. హృదయం గోడలకు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం? 

జ. హృదయ ధమనులు లేదా కరోనరి ధమనులు

58. హృదయంలో కుడి, ఎడమ కర్ణికలను వేరుపరిచే విభాజకం?

 జ. కర్ణికాంతర విభాజకం

59. హృదయంలో కుడి, ఎడమ జఠరికలను వేరుపరిచే విభాజకం? 

జ. జఠరికాంతర విభాజకం

60. కర్ణికలను, జఠరికలను వేరు చేసే విభాజకం? 

జ. కర్ణికా-జఠరికా విభాజకం

61. కుడి కర్ణిక, కుడి జఠరికలోకి దేని ద్వారా తెరచుకుంటుంది ? 

జ. కుడి కర్ణికా - జఠరికా రంధ్రం ద్వారా

62. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలోకి దేని ద్వారా తెరచుకుంటుంది ? 

జ. ఎడమ కర్ణికా - జఠరికా రంధ్రం 

63. కవాటాలను వాటి స్థానంలో బంధించి ఉంచే బంధన కణజాల తంతువులు ? 

జ. స్నాయు రజ్జువులు 

64. కుడి కర్ణికా, జఠరిక రంధ్రాన్ని కప్పుతూ ఉండే కవాటం? 

జ. అగ్రత్రయ కవాటం 

65. రెండు అగ్రాలు లేదా దళాలు ఉన్న కవాటాన్ని ఏమంటారు ?

జ. అగ్రద్వయ లేదా ద్విపత్ర లేదా మిట్రల్ కవాటం

66. ఎడమ కర్ణిక, జఠరికా రంధ్రాన్ని కప్పుతూ ఉండే కవాటం? 

జ. అగ్రద్వయ కవాటం 

67. కుడి జఠరిక నుంచి పుపుస మహాధమని బయలుదేరే చోట ఉన్న కవాటం?

జ. పుపుస కవాటాలు

68. ఎడమ జఠరికలో మహా ధమని బయలుదేరే చోట ఉన్న కవాటం?

జ. మహాధమని కవాటాలు

69. హృదయం చేసే ఓ సంకోచం, సడలికను ఏమంటారు ?

 జ. హృదయ స్పందన

70. హృదయ సంకోచ, సడలికలను ఏమంటారు ?

 జ. సిస్టోల్, డయాస్టోల్

71. రక్తం ప్రవహించే మార్గాన్ని ఏమంటారు ?

 జ. ప్రసరణ వలయం

72. హృదయం నిమిషానికి ఎన్ని సార్లు సంకోచ, సడలికలు జరుపుతుంది? 

జ. 70-80 సార్లు

73. హృదయ స్పందనలో రెండు కర్ణికలు ఒకేసారి సంకోచం చెంది రక్తంను జఠరికల్లోకి పంపే దశ?

 జ. కర్ణికల సిస్టోల్

74. రెండు జఠరికలు ఒకే సారి సంకోచం చెంది రక్తాన్ని రక్తనాళాల్లోకి పంపే దశ?

 జ. జఠరికల సిస్టోల్ 

75. కర్ణికలు, జఠరికలు సడలే దశ? 

జ. జఠరికల డయాస్టోల్ 

76. ఊపిరితిత్తులకు, హృదయానికి మధ్య జరిగే రక్త ప్రసరణ వలయం?

 జ. పుపుస వలయం 

77. హృదయానికి, శరీర అవయవాల మధ్య జరిగే రక్త ప్రసరణ వలయం? 

జ. దైహిక వలయం 

78. పుపుస, దైహిక వలయాల ద్వారా రక్తాన్ని పంపు చేసే హృదయాన్ని ఏమంటారు? 

జ. ద్వి వలయ ప్రసరణ హృదయం 

79. రక్తనాళాల్లో రక్తం ఎలా ప్రసరిస్తుంది ?

 జ. రక్త పీడనం వల్ల 

80. రక్తపీడనం ఏ రక్త నాళాల్లో ఎక్కువగా ఉంటుంది?

 జ. ధమనుల్లో

81. రక్త పీడనాన్ని కొలిచే పరికరం?

 జ. స్పిగ్మో మానోమీటరు 

82. మానవుని సామాన్య రక్తపీడనం? 

జ. 120/80 

83. రక్త పీడనం 120/80 లో 120 దేన్ని సూచిస్తుంది?

 జ. సిస్టోలిక్ పీడనం

84. రక్తపీడనం 120/80లో 80 దేనిని సూచిస్తుంది ?

 జ. డయాస్టోలిక్ పీడనం

85. 120/80 కంటే ఎక్కువగా ఉండే రక్త పీడనాన్ని ఏమంటారు? 

జ. అధిక రక్త పీడనం లేదా హైపర్ టెన్షన్ లేదా High B.P

86. High B.P. కి కారణం?

 జ. కొలెస్టరాల్ ధమనుల గోడలను చేరడం 

87. ఎడమ జఠరికలో మహా దమని ప్రారంభమయ్యే చోట ఉండే కవాటాల సంఖ్య?

జ.3

88. ఏ రక్తనాళంలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది?

 జ. హృదయ ధమని

No comments:

Post a Comment