Pages

Friday, August 13, 2021

సూక్ష్మజీవుల ప్రపంచం - శైవలాలు - శిలీంధ్రాలు - ప్రోటోజోవా

 సూక్ష్మజీవుల ప్రపంచం - శైవలాలు -  శిలీంధ్రాలు - ప్రోటోజోవా

1. ప్రోకారియోట్స్ కు ఉదాహరణ ? 

జ. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు 

2. ఆకుపచ్చ శైవలాల్లో ఉండే చలనాంగాలు ? 

జ. కశాభాలు 

3. బ్యాక్టీరియాను పోలి ఉండే శైవలాలు ? 

జ. నీలి ఆకుపచ్చ శైవలాలు 

4. సముద్రంలో తేలుతూ కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసుకునే జీవులు ? 

జ. డయాటమ్స్

 5. ఆకుపచ్చ శైవలానికి ఉదాహరణ ? 

జ. క్లామిడోమోనాస్

6. శిలీంధ్ర తంతువులను ఏమంటారు ?

జ. హైఫే (Hyphae) 

7. నీటిలో, తడిలో ఉండే సూక్ష్మజీవులు ఎన్ని రకాలు, అవి ఏవి ? 

జ. 3 రకాలు; 1. నీలి ఆకుపచ్చ శైవలాలు 2. ఆకుపచ్చ శైవలాలు 3. గోధుమ వర్ణ శైవలాలు 

8. సముద్రాల్లో ఉండే అతి సూక్ష్మ శైవలం? 

జ. డయాటమ్స్ (Diatoms) 

9. ఆల్కహాల్ కిణ్వనంలో ప్రముఖ పాత్ర వహించే శిలీంధ్రం ?

జ. ఈస్ట్

10. స్వేచ్చగా జీవించే ఏకకణ శిలీంధ్రం?

జ. ఈస్ట్

11. అననుకూల పరిస్థితుల్లో ప్రోటోజోవాలు ఏర్పరచుకునే నిర్మాణాలు ?

 జ. సిస్ట్ (కోశాలు) 

12. కంటికి కనిపించే శిలీంధ్రం? 

జ. కుక్కగొడుగు 

13. మానవుడి ఎర్రరక్తకణాల్లో ఉండే మలేరియాను కలుగజేసేది?

జ. ప్లాస్మోడియం 

14. శిలీంధ్రాల్లో పోషణ విధానం?

జ. పూతికాహార పోషణ

15. పెన్సిలిన్ ఉత్పత్తిలో ఉపయోగపడే శిలీంధ్రం?

 జ. పెన్సిలియం నొటేటం 

16. చెప్పు (స్లిప్పర్) ఆకారంలో ఉండే ప్రోటోజోవన్ ? 

జ. పారమీషియం

17. కదురు ఆకారంలో ఉండే ప్రోటోజోవన్ ?

జ. యూగ్లీనా

18. పత్రహరితం లేని వృక్షజాతి ?

జ. శిలీంధ్రాలు

19. చలనాన్ని బట్టి ప్రోటోజోవాలు ఎన్ని రకాలు, అవిఏవి ?

జ. 3 రకాలు

1. మిధ్యాపాదం - ఉదా: అమీబా

2. శైలికలు - ఉదా: పారమీషియం

     కశాభాలు - ఉదా: యూగ్లినా 

3. స్థానబద్ధ జీవులు - ఉదా: వర్టిసెల్లా 

20. మానవుడిలో జిగట విరేచనాలు (అమీబియాసిస్)ను కలుగజేసేది? 

జ. ఎంటమీబా హిస్టాలిటికా

21. ఆహార సేకరణకు మాత్రమే ఉపయోగపడే శైలికలు కలిగిన ప్రోటోజోవా ? 

జ. వర్టిసెల్లా

22. ప్రోటోజోవాలు వాటి సంఖ్యను ఏ పద్ధతి ద్వారా వృద్ధి చేసుకుంటాయి ?

జ. ద్విదావిచ్ఛిత్తి

23. మానవుడిలో అతి నిద్ర వ్యాధిని కలుగజేసేది?

జ. ట్రిపనోసోమా గాంబియన్సి 

No comments:

Post a Comment