Pages

Sunday, July 22, 2018

GK - Competitive Exams Special - Biology

1. ఆహార గొలుసులో శాఖాహారులు?  - (ప్రథమ వినియోగదారులు)

2. సముద్ర నీటి పై పొరల్లో ఉండేవి?  - (ప్లవకాలు మాత్రమే)

3. మొక్కలకు అతి ఎక్కువగా అవసరమయ్యే మూలకం? - (నైట్రోజన్)

4. "ఐరన్, జింక్, కాపర్" లలో సూక్ష్మ పోషకాలు? - (అన్నీ)

5. పంట మార్పిడి ఆవశ్యకత అంటే? - (భూసారాన్ని పెంచడం)

6. ప్రోటీన్లు వేటితో ఏర్పడతాయి? - (అమైనో ఆమ్లాలు)

7. అతి సరళమైన అమైనో ఆమ్లం? - (గ్లైసీన్)

8. ప్రొటీన్ల సంశ్లేషణ జరిగే ప్రదేశం? - (రైబోజోములు)

9. అనులేఖనం జరిగే ప్రదేశం? - (కేంద్రకం)

10. AUG అనే త్రికం ఏ అమైనో ఆమ్లంనకు సంకేతం? - (మిథియోనిన్)

11. అర్థరహిత కోడానులు? - (UAA, UAG, UGA)

12. లెగ్యూమ్ మొక్కల వేరు బుడిపెలో ఉండే లెగ్ హిమోగ్లోబిన్ ఏ రంగులో ఉంటుంది? - (ఎరుపు)

13. వాయు, అవాయు శ్వాసక్రియ రెండింటిలోనూ జరిగే చర్యలేవి? - (గ్లైకాలసిస్)

14. కిణ్వనం అంత్య ఉత్పన్నం ఏది? - (ఇథైల్ ఆల్కహాల్)

15. R.Q. విలువ ఒకటి అయితే శ్వాసక్రియాధస్థ పదార్ధం? - (కార్బోహైడ్రైట్స్)

16. గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయాల మధ్య వారధి? - (ఎసిటైల్ కో - ఎ)

17. "రైజోపస్, మ్యూకార్, అగారికస్, అమానిటా" లలో తినదగిన పుట్టగొడుగు ఏది?  - (అగారికస్)

18. "అగారికస్, అమానిటా, పాలీసోరస్, మ్యూకార్" లలో విషపూరిత పుట్టగొడుగు ఏది?  - (అమానిటా)

19. "రైజోపస్, అస్పర్ జిల్లస్, మ్యూకార్, అగారికస్" లలో "ప్రయోగ శాల కలుపుమొక్క" అని  దేనికి పేరు? - (రైజోపస్)

20. కిరణ జన్య సంయోగ క్రియ అనేది?  - (క్షయకారణ, నిర్మాణాత్మక చర్య)

21. "బొద్దింక, దోమ, ఈగ, సీతాకోక చిలుక" లలో కొరికి నమిలే భాగాలు ఏ కీటకంలో ఉంటాయి? - (బొద్దింక)

22. "బొద్దింక, మిడత, నల్లి" లలో గుచ్చి పీల్చే ముఖభాగాలు ఏ కీటకంలో ఉంటాయి? - (నల్లి)

23. బొద్దింక విసర్జక అవయవాలు? - (మాల్ఫీజియన్ నాళికలు)

24. ముఖ బాహ్య జీర్ణక్రియ కలిగిన జీవి? - (సముద్ర నక్షత్రం)

25. ప్లాస్మోడియం పరాన్నజీవి తన లైంగిక జీవితచక్రాన్ని దేనిలో జరుపుకుంటుంది? - (ఆడ అనాఫిలిస్ దోమ)

26. వానపాములో చలనం దేని ద్వారా జరుగుతుంది? - (సీటములు)

27. "జలగ, నత్త, హైడ్రా, కప్ప" లలో భిన్నమైనది ఏది? - (కప్ప)

28. ఆక్సిటోసిన్ హార్మోన్ ను ఏ గ్రంథి స్రవిస్తుంది? - (పీయూష గ్రంథి)

29. ఏ హార్మోన్ కు యాంటీ - ఇన్సులిన్ ప్రభావం ఉంటుంది? -  (గ్లూకగాన్)

30. "లోపలి చెవి, మధ్య చెవి, చెవి లేదు, లోపలి - మధ్య చెవి" లలో సర్పంలో ఉండేది ఏది? - (లోపలి చెవి)

31. రక్తంలో చక్కర స్థాయిని పెంచే హార్మోన్?  - (గ్లూకగాన్)

32. "తాబేలు, తొండ, మొసలి, బల్లి" లలో ఏ సరీసృపం గుండెలో రెండు జఠరికలు ఉంటాయి? - (మొసలి)

33. "ట్రీ స్నేక్, గ్లాస్ స్నేక్, బ్లైండ్ స్నేక్, సముద్ర సర్పం" లలో నిజమైన సర్పం కానిది ఏది? - (గ్లాస్ స్నేక్)

34. వెనుకకు ఎగిరే పక్షి? - (హమ్మింగ్ బర్డ్)

35. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? - (లామార్క్)

36. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని  ప్రతిపాదించిన శాస్త్రవేత్త? - (డెవ్రిస్)

37. ప్రతి జీవి తన పిండదశల ద్వారా పూర్వీకుల దశలను స్పరించుకుంటుందని తెలిపిన శాస్త్రవేత్త? - (హెకెల్)

38. "మనుగడ కోసం పోరాటం" అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త? - (డార్విన్)

39. కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? - (రాబర్ట్ బ్రౌన్)

40. గ్లైకాలసిస్ జరిగే ప్రదేశం ఏది? - (సైటో ప్లాజం)

41. క్రెబ్స్ వలయం జరిగే ప్రదేశం ఏది? - (మాత్రిక)

42. ఎలక్ట్రాన్ రవాణా చర్యలు జరిగే ప్రదేశం ఏది? - (క్రిస్టే)

43. "చెరకు, మొక్కజొన్న, వరి, జొన్న" లలో C₄ మొక్క కానిది ఏది? - (వరి)

44. శుద్ధ జలం నీటి శక్మం విలువ?  - (0)

45. గ్లైకాలసిస్ అంత్య పదార్ధం ఏది? - (పైరూవిక్ ఆమ్లం)

46. మొక్కల్లో ఉండే వృద్ధి నిరోధకం ఏది? - (అబ్ సైసికామ్లం)

47. సహజ ఆక్సిన్ ఏది? - (IAA)

48. హృదయ స్పందన రేటు అత్యల్పంగా ఉండే జంతువు ఏది? - (తిమింగలం)

49. విత్తన సుప్తావస్థను తొలగించే ఫైటో హార్మోన్ ఏది? - (జిబ్బరెల్లిన్)

50. "కొలిసిస్టోసిన్, కొలిసిస్టోకైనిన్, ఆక్సిటోసిన్, ట్రిప్సిన్" లలో ఏ హార్మోన్ ను చిన్నపేగు స్రవిస్తుంది? - (కొలిసిస్టోకైనిన్)

No comments:

Post a Comment