Pages

Thursday, November 11, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - ఉపయోగకరమైన & అపాయకరమైన సూక్ష్మజీవులు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - ఉపయోగకరమైన  & అపాయకరమైన సూక్ష్మజీవులు 

 1. మొక్కల్లో ఉండే సెల్యులోజ్ ను జీర్ణం చేయడంలో ఉపయోగపడేవి ? 

జ. సూక్ష్మజీవులు

 2. ఆల్కహాల్ ఉత్పత్తికి, సూక్ష్మజీవనాశన ఔషధాలు, విటమిన్ల తయారీలో అవసరమైనవి ? 

జ. సూక్ష్మజీవులు

 3. పాలలో ఉండే బ్యా క్టీరియా పేరు ? 

జ. లాక్టోబాసిల్లస్

 4. పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా? 

జ. లాక్టోబాసిల్లస్ 

5. పెరుగు నుంచి వెన్న తీసిన తర్వాత మిగిలే ద్రవం ?

 జ. మజ్జిగ

6. పాల నుంచి జున్ను ఎలా తయారవుతుంది?

జ. కెసిన్ అనే ప్రొటీన్ ద్వారా 

7. పాలకు సూక్ష్మజీవులను చేర్చి కేసిన్ అనే పాల ప్రొటీన్ ను స్కందనం చేయడాన్నేమంటారు ? 

జ. కాటేజ్ జున్ను లేదా క్రీమ్ జున్ను

 8. కాటేజ్ జున్నును కొన్ని పద్ధతుల ద్వారా మార్చడాన్ని ఏమంటారు ? 

జ. పరిపక్వత లేదా క్యూరింగ్

 9. జున్నులో ఉండే రకాలు?

జ.300

10. నత్రజనిని మొక్కలు ఏ రూపంలో వినియోగించుకుంటాయి ?

జ. నైట్రేట్ల రూపంలో

11. వాతావరణంలోని నత్రజని, భూమిలో నత్రజని లవణాలుగా ఏర్పడటం?

జ. నత్రజని స్థాపన 

12. నత్రజని స్థాపనకు ఉపయోగపడే బ్యా క్టీరియా? 

జ. అజటోబాక్టర్ 

13. చిక్కుడు, వేరుశనగ వంటి మొక్కల వేళ్ళపై జీవించే బ్యాక్టీరియాలు ? 

జ. రైజోబియం, లెగ్యుమినోశారం

 14. బ్యాక్టీరియాలు, మొక్కలు ఒకదానికొకటి సహాయం చేసుకునే సహకార జీవితం?

జ. సహజీవనం

15. సహజీవనంలోని భాగస్తులను ఏమంటారు?

జ. సహజీవులు

 16. అమ్మోనిఫయింగ్ బ్యాక్టీరియాలు ఎమైనో ఆమ్లాలను ఎలా మారుస్తాయి? 

జ. అమ్మోనియా మౌగికాలుగా

 17. ఆక్సిజన్ లేనపుడు ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ? 

జ. కిణ్వన ప్రక్రియ, లేదా పులియుట

 18. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే శిలీంధ్రం ? 

జ. ఈస్ట్ 

19. కిణ్వన ప్రక్రియలో చక్కెర అణువులు వేటిగా మారుతాయి ? 

జ. ఆల్కహాల్, కార్బన్ డై ఆక్సైడ్ 

20. ఆల్కహాలు పానీయాలు మానవుడిలో ఏ భాగంపై పనిచేస్తాయి ?

జ. నాడీమండలం

21. సహజంగా లభ్యమయ్యే జీవుల్లోని జీవ పదార్థాల నుంచి తయారయ్యే ఎరువులు ?

జ. జీవ లేదా బయో ఎరువులు

22. రసాయనిక పదార్థాలను ఉపయోగించి కర్మాగారాల్లో తయారుచేసే ఎరువులు ?

 జ. కృత్రిమ ఎరువులు

 23. సహజ ఎరువుల తయారీకి ఉపయోగపడే సూక్ష్మజీవులు ?

 జ. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు 

24. సజీవ సూక్ష్మజీవుల నుంచి తయారుచేసిన రసాయన పదార్థాలనేమంటారు ?

జ. ఆంటిబయోటిక్స్

25. బ్యాక్టీరియాను చంపే శక్తి కలిగిన పెనిసిలిన్ దేని నుంచి తయారుచేస్తారు ?

జ. పెనిసిల్లియం నొటేటం అనే శిలీంద్రం నుంచి 

26. ఆంటిబయోటిక్స్ కు ఉదాహరణ? 

జ. స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిటిన్, టెట్రాసైక్లిన్, ఎరిత్రోమైసిన్ 

27. చిక్కుడు జాతి మొక్కల వేరుబుడిపెల్లో సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా?

 జ. రైజోబియం లెగ్యుమినోశారం.

28. శైవలాలు, శిలీంధ్రాలు వర్ధనం చేయయడానికి యానకంగా వాడేది ?

 జ. అగార్ - అగార్ అనే శైవలం 

29. చేపలకు ఆహారంగా ఉపయోగపడే శైవలాలు ? 

జ. ఈడోగోనియం,యులో థ్రిక్స్ 

30. నత్రజని స్థాపనలో ఉపయోగపడే శైవలాలు ?

 జ. నాస్టాక్, అనాబీనా

31. శైవలాల నుంచి లభ్యమయ్యే అయోడిన్ ఏ వ్యాధి నివారణకు వాడుతారు ?

 జ. సామాన్య గాయిటర్

32. క్లోరెల్లా అనే శైవలం నుంచి లభించే సూక్ష్మజీవనాశకం? 

జ. క్లోరెల్లిన్ 

33. జున్ను పరిశ్రమలో ఉపయోగపడే శిలీంద్రం? 

జ. పెన్సిలియం రాక్విపోర్ట, పెన్సిలియం కుంబర్టెన్

34. వ్యాధి పరిస్థితులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? 

జ. వ్యాధి శాస్త్రం - పెథాలజీ 

35. వ్యాధిని కలుగజేసే జీవులనేమంటారు ?

 జ. వ్యాధి జనకాలు(పాథోజెన్స్) 

36. వ్యాధిజనక జీవులు? 

జ. వైరస్, బ్యా క్టీరియా, శైవలాలు, శిలీంద్రాలు 

37. ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి సంక్రమించటాన్ని ఏమంటారు ?

 జ. వ్యాధి వ్యాప్తి

 38. వ్యా ధిని వ్యాప్తి చేసే కారకాలనేమంటారు ? 

జ. వాహకాలు 

39. వ్యాధి జనకాల ప్రభావానికి లోనుకాకుండా అశ్రయం ఇచ్చే జీవులనేమంటారు?

 జ. ఆశయాలు లేదా రిజర్వాయర్లు

 40. మొక్కల వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్నేమంటారు? 

జ. వృక్షవ్యాధి శాస్త్రం

No comments:

Post a Comment