Pages

Thursday, July 5, 2018

GK - Competitive Exams Special - Biology

జీవశాస్త్రం 
1. జన్యు పరివర్తనం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవి? - (బ్యాక్టీరియా)

2. ద్విధావిచ్చిత్తిని జరుపుకునే జీవులు? - (బ్యాక్టీరియా, యూగ్లీనా)

3. వైరస్ లలో జరిగే ప్రతీకృతి విధానం? - (లైటిక్ వలయం)

4. బ్యాక్టీరియా లో జరిగే ప్రత్యుత్పత్తి విధానం? - (సంయుగ్మము, ద్విధావిచ్చిత్తి)

5. సహజీవనానికి ఒక ఉదాహరణ? - (లైకెన్, మైకోరైజ, చిక్కుడు - రైజోబియం)

6. కమెన్సాల్ కి ఒక ఉదాహరణ? - (ఇశ్చరిషియా కొలి)

7. రైజోబియం అనేది? - (బ్యాక్టీరియా)

8. రైజోపస్ అనేది? - (శిలీంద్రం)

9. "మ్యూకార్, పెన్సీలియం, న్యూరోస్పొరా, స్పైరో గైరా " లలో భిన్నమైన జీవి?  - (స్పైరో గైరా)

10. బ్రెడ్ మోల్డ్ : రైజోపస్ :: కొలను పట్టు : -----? (స్పైరో గైరా)

11. సజీవ కణంలో మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవి? - (వైరస్)

12. ఆంథరీడియ, ఆర్కిగొనియా అనే ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉండే మొక్క? - (ఫ్యునేరియా)

13. నగ్న అండాలను కలిగి ఉండే మొక్క? - (సైకస్)

14. టాడ్ పోల్ దశ ఏ జీవి జీవిత చక్రంలో కనిపిస్తుంది?  - (కప్ప)

15. ఏనుగు గర్భావధి కాలం ఎన్ని రోజులు? - (600)

16. "హైడ్రోఫిలి" అంటే?  - (నీటి ద్వారా జరిగే సంపర్కం)

17. పుష్పంలోని ఏ భాగంలో పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి?  - (కేసరం)

18. పరాగరేణువుల అధ్యయనాన్ని ఏమంటారు? - (పేలినాలజి)

19. "ఎనిమోఫిలి" అంటే? - (గాలి ద్వారా జరిగే సంపర్కం)

20. కీటకాల ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? - (ఎంటమోఫిలి)

21. పరాగరేణువులు అండకోశం కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? - (పరాగ సంపర్కం)

22. "ఆర్నితోఫిలి" అంటే? - (పక్షుల ద్వారా జరిగే సంపర్కం)

23. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ను ఏమంటారు?  -(వాసెక్టమీ)

24. స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ను ఏమంటారు?  -(ట్యూబెక్టమీ)

25. గర్భ నిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్?  - (ప్రొజెస్టిరాన్)

26. అండం జీవితకాలం ఎన్ని రోజులు?  - (1 రోజు)

27. శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం? - (అంటుతొక్కడం, అంటుకట్టడం, చేధనం)

28. అమీబా చలనాంగాలను ఏమంటారు? - (మిథ్యాపాదాలు)

29. వానపాము చలనాంగాలను ఏమంటారు? - (శూకాలు)

30. హైడ్రా చలనాంగాలను ఏమంటారు? - (స్పర్శకాలు)

31. పారమీషియం చలనాంగాలను ఏమంటారు? - (శైలికలు)

32. బాక్టీరియాలో చలనాంగాలను ఏమంటారు? - (కశాబాలు)

33. ఈగ లార్వాను ఏమంటారు? - (మాగ్గట్)

34. "రిగ్లర్" అనేది ఏ జీవి జీవితచక్రంలోని ఒక దశ? - (దోమ)

35. "నిడేరియా" వర్గానికి చెందిన లార్వా లను ఏమంటారు? - (ప్లాన్యులా)

36. "అనెలిడా" వర్గానికి చెందిన లార్వా లను ఏమంటారు? - (ట్రాకోఫోర్)

37. "క్లోరెల్లా" చలనాంగాలను ఏమంటారు? - (చలనాంగాలు ఉండవు)

38. "కీమోటాక్సిస్" అంటే? - (వివిధ రసాయన పదార్థాలకు ప్రతిస్పందనగా జీవులు చూపే చలనం) 

39. "మ్యూల్, హిన్ని, ఫెలిస్" లలో వంధ్య జీవులు? - (మ్యూల్, హిన్ని)

40. "వానపాము, ఎలికపాము, బద్దెపురుగు" లలో ఉభయ లింగ జీవులు?  - (వానపాము, బద్దెపురుగు)

41. "మిల్ట్" అంటే?  - (శుక్రకణాల సముదాయం)

42. "స్పాన్" అంటే?  - (అండాల సముదాయం)

43. ఒంటె గర్భావధి కాలం ఎన్ని రోజులు? - (400)

44. "క్షీరదం, పక్షి, చేప" లలో ఉల్బరహిత జీవి? - (చేప)

45. " వానపాము,కప్ప, చేప" లలో బాహ్య ఫలదీకరణం జరుపుకునే జీవులు? - (వానపాము,కప్ప, చేప)

46. "ఎఖిడ్నా, ప్లాటిపస్, రక్తపింజర" లలో అండోత్పాదక జీవులు? - (ఎఖిడ్నా, ప్లాటిపస్)

47. మొలస్కా జీవుల చలనాంగం?  - (పాదం)

No comments:

Post a Comment