Pages

Monday, April 26, 2021

Science Quiz - Non-metals

 అలోహాలు 

1. ప్రకృతిలో దొరికే అతి తేలికైన మూలకం?

ఎ) హీలియం బి) హైడ్రోజన్ సి) ఆక్సిజన్ డి) నైట్రోజన్   (బి)

2. మండే ధర్మం ఉన్న (జ్వలనశీల) వాయువు?

ఎ) హీలియం బి) హైడ్రోజన్ సి) ఆక్సిజన్ డి) నైట్రోజన్      (బి)

3. మండటానికి సహాయపడే వాయువు ?

ఎ) హీలియం బి) హైడ్రోజన్ సి) ఆక్సిజన్ డి) నైట్రోజన్     (సి)

 4. మంటలనార్పే వాయువు ?

ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్ సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) ఏదీకాదు (సి)

5. నీరు హైడ్రోజన్ యొక్క?

ఎ) ఆక్సైడ్ బి) సల్ఫైడ్ సి) క్లోరైడ్ డి) ఏదీకాదు   (ఎ)

6. భారజలం అనేది?

 ఎ) ఉప్పు కల్సిన నీరు బి) భార హైడ్రోజన్ (డ్యుటీరియం ఆక్సెడ్)   (బి)

సి) కఠిన జలం డి) ఏదీకాదు 

7. సాధారణ ఆమ్లాల్లో తప్పనిసరిగా ఉండే మూలకం ?

ఎ) హైడ్రోజన్ బి) ఆక్సిజన్ సి) నైట్రోజన్ డి) క్లోరిన్   (ఎ)

8. ఏ వాయువు లోపించడం వల్ల కలుషిత నీటిలో చేపలు జీవించలేవు ?

ఎ) ఆక్సిజన్ బి) హైడ్రోజన్ సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) హీలియం    (ఎ)

 9. కఠినజలం అంటే?

ఎ) తాకితే గట్టిగా ఉండే నీరు         బి) సబ్బుతో నురుగనివ్వని నీరు    (బి)

సి) మంచు రూపంలో ఉన్న నీరు డి) ఏదీకాదు 

10. నీరు మంచుగడ్డగా మారినపుడు?

ఎ) సంకోచిస్తుంది బి) వ్యాకోచిస్తుంది సి) ఘనపరిమాణంలో మార్పు ఉండదు డి) చెప్పలేం  (బి)

11. నీటిపై మంచుముక్కను వేస్తే?

ఎ) తేలుతుంది బి) మునుగుతుంది సి) చిటపటమని ఎగిరిపడుంది డి) చెప్పలేం  (ఎ)

12. విశ్వద్రావణి అని దేన్నంటారు?

ఎ) సారాయిబి) బ్రాందీ సి) బీరు డి) నీరు   (డి)

13. రాకెట్ కు ఇంధనంగా పనికొచ్చేది?

ఎ) మిథేన్ బి) ఎల్ పిజీ (L P G) సి) ద్రవ హైడ్రోజన్ డి) పెట్రోల్    (సి)

14. నీటిని సూక్ష్మజీవి రహితంగా చేయడానికి విరంజన చూర్ణం కలుపుతారు. దీని ద్వారా విడుదలయ్యే వాయువు?

 ఎ) క్లోరిన్ బి) ఓజోన్ సి) ఆక్సిజన్ డి) నైట్రోజన్  (ఎ)

15. నీటిని క్రిమిరహితంగా చేసే ప్రక్రియలు?

ఎ) క్లోరిన్ వాయువు కలపడం బి) ఓజోన్ వాయువు పంపించడం 

సి) అతినీలలోహిత కిరణాలు పంపించడం డి) పైవన్నీ    (డి)

16. ఏ మంటలను నీరు ఆర్పలేదు?

ఎ) వస్త్రాలు కాలినప్పుడు బి) చమురు సి) ప్లాస్టిక్ డి) పిడుగుపాటుతో వచ్చే   (బి)

17. చమురు మంటలను నీటితో ఆర్పలేకపోవడానికి కారణం?

ఎ) చమురు నీటిపై తేలుతుంది బి) నీరు చమురుపై తేలుతుంది   (ఎ)

సి) నీరు చమురులో కల్సిపోయి పెద్దగా మండుతుంది డి) నీరు ఖరీదైంది 

18. మట్టిపాత్రలో నీరు చల్లగా ఎందుకుంటుంది?

ఎ) మట్టి పాత్రకు ఉండే సూక్ష్మరంధ్రాల ద్వారా నీరు ఆవిరి కావడం 

బి)మట్టిపాత్రలు నీటిలోని వేడిని పీల్చివేస్తాయి

 సి) మట్టిలో మెంథాల్ ఉండటం వల్ల

డి) కుండ అడుగుభాగంలో ఐస్ ఉండటం     (ఎ)

19. టింక్చర్ అయోడిన్ అనేది?

ఎ) అయోడిన్ జల ద్రావణం బి) ఆల్కహాల్ లో కరిగించిన అయోడిన్ 

సి) పొటాషియం అయోడైడ్  లో కరిగించిన అయోడిన్ జలద్రావణం    

డి) పొటాషియం అయోడైడ్ జలద్రావణం     (బి)

20. ఆహారం నిల్వ ఉంచడానికి ఉపయోగించే పదార్థం?

ఎ) సోడియం సల్ఫేట్ బి) శాఖరిన్ సి) సుక్రలోజ్ డి) సోడియం మెటా బై సల్ఫైడ్    (డి)

21. సముద్రపు మొక్కల నుంచి సంగ్రహించే హలోజన్?

ఎ) ఫ్లోరిన్ బి) బ్రోమిన్ సి) అయోడిన్ డి) క్లోరిన్   (సి)

22. పంటి ఎనామిల్ లోని రసాయన పదార్థం?

ఎ) కాల్షియం ఫ్లోరైడ్ బి) హైడ్రాక్సీ అపటైట్  సి) ఫ్లోరపటైట్ డి) కాల్షియం కార్బొనేట్ (బి)

23. నీటిలో ఫ్లోరైడ్ గాఢత 1 PPM కంటే తక్కువగా 0°C ఉన్నప్పుడు పంటి ఎనామి ల్ ను మరింత గట్టి పదార్థంగా మార్చేది? 

ఎ) కాల్షియం ఫ్లోరైడ్ బి) హైడ్రాక్సీ అపటైట్ సి) ఫ్లోరపటైట్ డి) కాల్షియం కార్బొనేట్  (సి)

24. టూత్ పేస్ట్ లో ' ఫ్లోరైడ్ 'ను ఏ రూపంలో చేరుస్తారు?

ఎ) సోడియం ఫ్లోరైడ్ బి) కాల్షియం ఫ్లోరైడ్ సి) హైడ్రోఫ్లోరికామ్లం డి) బోరాన్ టై ఫ్లోరైడ్   (ఎ)

 25. మత్తుపదార్థంగా ఉపయోగించే ఫ్లోరిన్ సమ్మేళనం?

ఎ) ప్లోథేన్ బి) ప్రియాన్ సి) టెఫ్లాన్ డి) ఏదీకాదు   (ఎ)

 26. శీతలీకారిణిగా వాడే, ఓజోన్ పొరకు హాని కలిగించే క్లోరోఫ్లోరో కార్బన్లను ఏమంటారు?

ఎ) ఫ్రియాన్లు బి) టెఫ్లాన్ సి) ఫ్లోబోరికామ్లం డి) క్రయొలైట్స్    (ఎ)

27. నాన్ స్టిక్ వంట సామగ్రిలో ఉపయోగించే పాలీ టెట్రాప్లోరో ఇథిలీన్ కు గల మరోపేరు?

ఎ) ఫ్రియాన్ బి) టెఫ్లాన్ సి) పాలిథీన్ డి) పి.వి.సి (P.V.C)       (బి)

28. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోని హలోజన్?

ఎ) ఫ్లోరిన్ బి) క్లోరిన్ సి) బ్రోమిన్ డి) అయోడీన్      (సి)

 29. కిందివాటిలో ఉత్పతనం చెందేది?

ఎ) ఫ్లోరిన్ బి) క్లోరిన్ సి) బ్రోమిన్ డి) అయోడీన్    (డి)

30. వానపాములను చంపడానికి వాడే రసాయన పదార్థం?

ఎ) మిథైల్ క్లోరైడ్ బి) మిథైల్ బ్రోమైడ్ సి) మిథైల్ అయోడైడ్ డి) మిథైల్ ఫ్లోరైడ్   (బి)

31. మూర్ఛవ్యాధి చికిత్సలో వాడే రసాయనం ఏది?

ఎ) పొటాషియం క్లోరైడ్ బి) పొటాషియం బ్రోమైడ్ 

సి) సోడియం క్లోరైడ్ డి) సోడియం ఫాస్పేట్   (బి)

32. మత్తుపదార్థంగా దీన్ని వాడతారు?

ఎ) కార్బన్ టెట్రాక్లోరైడ్ బి) క్లోరోఫాం సి) బెంజీన్ డి) ట్రైక్లోరో ఎథిలీన్   (బి)

 33. డ్రై క్లీనింగ్ రసాయనాలుగా ఉపయోగపడేవి ?

ఎ) కార్బన్ టెట్రాక్లోరైడ్ బి) బెంజిన్ సి) ట్రైక్లోరో ఎథిలీన్ డి) పైవన్నీ   (డి)

 34. మంచుగడ్డపై ఉప్పు చల్లితే?

ఎ) వెచ్చనవుతుంది. బి) చల్లనవుతుంది 

సి) ఉష్ణోగ్రతలో మార్పురాదు   డి) వాయు రూపంలోకి మారుతుంది     (బి)

35. ఆకుపచ్చని వాయువు?

ఎ) ఫ్లోరిన్ బి) క్లోరిన్ సి) బ్రోమిన్ డి) అయోడిన్     (బి)

36. బూజుపట్టకుండా ఉపయోగించే రసాయనం?

ఎ) గంధకం బి) భాస్వరం సి) అయోడిన్ డి) సోడియం   (ఎ)

 37. అగ్నిపర్వతాల ద్వారా లభ్యమయ్యే అతి ముఖ్యమైన అలోహం?

ఎ) అయోడిన్ బి) భాస్వరం సి) గంధకం డి) సోడియం   (సి)

 38. కిందివాటిలో ఉత్పతనం చెందే లవణం?

ఎ) సోడియం క్లోరైడ్ బి) సోడియం సల్ఫేట్

 సి) అమ్మోనియం క్లోరైడ్ డి) అమ్మోనియం సల్ఫేట్      (సి)

39. స్పృహ తెప్పించేందుకు వాడే అమ్మోనియం లవణం?

ఎ) అమ్మోనియం క్లోరైడ్ బి) అమ్మోనియం బ్రోమైడ్ 

సి) అమ్మోనియం సల్ఫేట్ డి) అమ్మోనియం కార్బొనేట్     (ఎ)

40. స్మెల్లింగ్ సాల్ట్ అని దేనికి పేరు?

ఎ) అమ్మోనియం క్లోరైడ్ బి) అమ్మోనియం బ్రోమైడ్ 

సి) అమ్మోనియం సల్ఫైట్ డి) అమ్మోనియం కార్బొనేట్      (ఎ)

No comments:

Post a Comment