పోటీ పరీక్షల ప్రత్యేకం - బయాలజీ
1. కేసరి పప్పు తినడం వల్ల కలిగే వ్యాధి? - (లాథింజం)
2. పాలలో ఉండే ప్రోటీన్ ఏది? - (కెసిన్)
3. బయోటిన్ ఒక - ? (విటమిన్)
4. మానవుని మూత్రం ద్వారా విసర్జితమయ్యే విటమిన్? - (విటమిన్ - సి)
5. ఉసిరి, మామిడి, చేప లలో విటమిన్ -సి లభించని పదార్ధం ఏది? - (చేప)
6. ప్రోటీన్, పిండి పదార్థం, విటమిన్, కొవ్వు పదార్ధం లలో సూక్ష్మ పదార్థం ఏది? - (విటమిన్)
7. వేడి చేస్తే నశించే విటమిన్ ఏది? - (ఎస్కార్బికామ్లం)
8. కింది వాటిని జతపరచండి.
1. విటమిన్ - సి ఎ. సూర్యరశ్మి
2. విటమిన్ - డి బి. పుల్లటి ఫలాలు
3. విటమిన్ - ఎ సి. ఆకుకూరలు
4. ఇనుము డి. ఎండు ఫలాలు
(జవాబు : 1 - బి; 2 - ఎ; 3 - సి; 4 - డి)
9. ప్రొటీన్ల నిర్మాణాత్మక ప్రమాణం? - (అమైనో ఆమ్లం)
10. కింది వాటిని జతపరచండి.
1. విటమిన్ - ఎ ఎ. స్కర్వీ 2. విటమిన్ - డి బి. నిక్టోలోఫియ
3. విటమిన్ - సి సి. స్టెరిలిటీ
4. విటమిన్ - ఇ డి. రికెట్స్
(జవాబు : 1 - బి; 2 - డి ; 3 - ఎ ; 4 - సి )
11. తేనెలో ఉండే చెక్కర ఏది? - (ఫ్రక్టోజ్)
12. ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఏ పోషక పదార్థం లోపం వల్ల కలుగుతుంది? - (కాల్షియం)
13. రైబోఫ్లెవిన్, నియాసిన్, బయోటిన్, టోకోఫెరాల్ లలో బి - కాంప్లెక్స్ విటమిన్ కానిది ఏది? - (టోకోఫెరాల్)
14. బీటా కెరోటిన్ అనేది ఒక ......... ? - (ప్రో విటమిన్)
15. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వయోజన మానవునికి ఒక రోజుకి ఎంత విటమిన్ - సి అవసరం? - (40 మిల్లీ గ్రాములు)
16. గుడ్డులో ఉండే ప్రోటీన్ ఏది? - (ఎవిడిన్)
17. పీచు పదార్థం లభించే ఆహార పదార్థాలు? - (ఆకుకూరలు, బీన్స్, ఫలాలు)
18. కింది వాటిని జతపరచండి.
1. గ్లుటిన్ ఎ. గోధుమ
2. ఎవిడిన్ బి. చర్మం
3. కెరాటిన్ సి. పాలు
4. కెసిన్ డి. గుడ్డు
(జవాబు : 1 - ఎ ; 2 - డి ; 3 - బి ; 4 - సి)
19. గర్భిణులకు ఎక్కువగా అవసరమయ్యే విటమిన్? - (ఫోలికామ్లం)
20. గోల్డెన్ రైస్ లో లభించే విటమిన్? - (రెటినాల్)
21. శస్త్ర చికిత్స చేసే ముందు ఇచ్చే విటమిన్ ఏది? - (ఫిలోక్వినోస్)
22. రెటినాల్ : రే చీకటి :: థయమిన్ ; ......... ? - (బెరి - బెరి)
23. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే విటమిన్? - (బీటా కెరోటిన్, టోకోఫెరాల్, ఎస్కార్బికామ్లం)
24. లాథిరిజం ఉన్న వ్యక్తి లో ఏ అవయవాల మధ్య సమన్వయం ఉండదు? - (కాళ్లు)
25. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? - (న్యూఢిల్లీ)
26. జీవ కణంలో ఎక్కువగా ఉండే పదార్థం? - (నీరు)
27. ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు? - (పెరుగు, కెఫిర్)
28. ఆవు, ఒంటె, గేదె, మేక పాలలో కొవ్వు శాతం ఎక్కువగా వేటిలో ఉంటుంది? - (గేదె)
29. ఎదిగే పిల్లలకు అవసరమయ్యే పోషక పదార్థాలు ఏమిటి? - (ప్రోటీన్లు)
30. బ్యూటీ విటమిన్ అని దేనిని అంటారు? - (టోకోఫెరాల్)
31. గ్లైసిన్ అనేది ఒక ........ ? - (అమైనో ఆమ్లం)
32. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు? - (ఆగస్టు మొదటి వారం)
33. సముద్ర మొక్కల్లో లభించే ఖనిజ మూలకం? - (అయోడిన్)
34. ప్రోటీన్లు, కేలరీల లోపం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి? - (మెరాస్ మస్)
35. సెల్యులోజ్, సుక్రోజ్, స్టార్చ్ లలో పాలిశాఖరైడ్? - (సెల్యులోజ్ & స్టార్చ్)
36. పాలను వేడిచేసినపుడు లేత పసుపురంగులోకి మారడానికి గల కారణం? - (రిబో ఫ్లెవిన్)
37. ఆహార, ఔషధ పరిశ్రమల్లో సహజ రంగుగా ఏ విటమిన్ ఉపయోగిస్తారు? - (రిబో ఫ్లెవిన్)
38. కండరాలు సంకోచించడానికి అవసరమయ్యే ఖనిజ మూలకం? - (కాల్షియం)
39. ఓలికామ్లం, ఫోలికామ్లం, లినోలికామ్లం లలో ఆవశ్యక ఫాటీ ఆమ్లం ఏది? - (లినోలికామ్లం)
40. బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగటం వల్ల ఏ విటమిన్ లోపిస్తుంది? - (థయామిన్)
41. పప్పుదినుసులు : ప్రోటీన్లు :: ఆలుగడ్డ ; ......... ? - (పిండి పదార్థాలు)
42. గ్లూకోజ్, లాక్టోజ్, శకారిన్ లలో శక్తి( కేలరీలు)ఇవ్వని తీపి పదార్థం ఏది? - (శకారిన్)
43. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి? - (గాయిటర్)
44. విటమిన్ - సి, విటమిన్ - బి6, విటమిన్ - డి లలో నీటిలో కరగని విటమిన్ ఏది? - (విటమిన్ - డి)
No comments:
Post a Comment